వృద్ధ మహిళల్లో పక్షవాతం నివారణ ఇలా...

6 May, 2015 23:16 IST|Sakshi
వృద్ధ మహిళల్లో పక్షవాతం నివారణ ఇలా...

 పోరాడే పొటాషియమ్

వయసు పైబడ్డ మహిళలు, మెనోపాజ్ దశకు చేరుకున్న వారిలో అకస్మాత్తుగా వచ్చే హార్మోన్ల అసమతౌల్యత వల్ల పక్షవాతం రిస్క్ పెరుగుతుంది. ఆహారంలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువగా ఉంటే, అది రక్తపోటును నియంత్రించి, పక్షవాతం రిస్క్‌ను గణనీయంగా తగ్గిస్తుందని రుతుస్రావం ఆగిన 50-79 ఏళ్ల మధ్యన ఉన్న 90,137 మంది మహిళలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. వీళ్లకు పొటాషియమ్ అధిక మోతాదులో ఉండే అరటి వంటి పండ్లు, ఆకుకూరలు, బీన్స్ వంటి కూరగాయలు, పాలు, మాంసాహారం ఇచ్చారు.
ఈ ఆహారం తీసుకున్న 16% మందిలో ఇస్కిమిక్ స్ట్రోక్  నివారితమైంది. అంతేకాదు... స్ట్రోక్ వల్ల కలిగే మరణాలలోనూ 10% తగ్గుదల కనిపించింది. ఈ విషయాలన్నీ ‘స్ట్రోక్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సుల మేరకు మహిళలు, ప్రత్యేకంగా మెనోపాజ్ వచ్చిన వారికి ప్రతిరోజూ 3.510 గ్రాముల పొటాషియమ్ అవసరం కాగా కేవలం 16.6 శాతం మందిలోనే ఈ మేరకు పొటాషియమ్ పాళ్లు ఉన్నాయి.

 

మరిన్ని వార్తలు