పరిపరి శోధన

4 Sep, 2015 01:07 IST|Sakshi
పరిపరి శోధన

నీతులు చెప్పేవారే...

 బయట ఎక్కువగా నీతులు చెప్పేవారు, బుద్ధిగా నీతిచంద్రికలను చదువుతూ కనిపించేవారు అవకాశం దొరికితే చేతివాటం ప్రదర్శిస్తారట! ‘ఇదేమీ ఆషామాషీగా చెబుతున్న విషయం కాదు. నీతిబోధకులపై విషప్రచారం అంతకంటే కాదు. పచ్చినిజం’ అని అంటున్నారు కాలిఫోర్నియా వర్సిటీ తత్వశాస్త్ర ప్రొఫెసర్ ఎరిక్ ష్విజ్‌గెబెల్. లైబ్రరీల్లో ఎక్కువగా చేతివాటానికి గురయ్యే పుస్తకాలు నీతులకు సంబంధించినవేనని ఆయన తన అధ్యయనం సాక్షిగా చెబుతున్నారు.

లైబ్రరీలను తరచు సందర్శించే వారిలో కొందరు అప్పుడప్పుడు చేతివాటానికి పాల్పడుతుండటం తెలిసిందే. ‘గ్రంథ’చోరుల చేతివాటానికి గురవుతున్న పుస్తకాలలో ఇతర విషయాలకు సంబంధించిన వాటితో పోలిస్తే, నీతులకు సంబంధించినవే 50 శాతం ఎక్కువగా ఉంటున్నట్లు తన అధ్యయనంలో తేలిందని ఈ ప్రొఫెసర్‌గారు వాపోతున్నారు.
 
 

>
మరిన్ని వార్తలు