తాదుర్దా

20 Jan, 2020 00:47 IST|Sakshi

సాహిత్య మరమరాలు

‘ఆంధ్రరత్న’ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఓసారి ప్రయాణానికి జట్కా మాట్లాడుకున్నారు. అయితే, ముందువైపు బరువు చాలక జట్కాతోలే మనిషికి ఇబ్బంది అయింది. అందుకే, ‘కొంచెం పైకి రండి సార్‌’ అన్నాడు. దానికి దుగ్గిరాల ముచ్చటగా– ‘ఇంతకాలానికి నువ్వొక్కడివి దొరికావురా, ఆంధ్రదేశంలో తోటి ఆంధ్రుడిని పైకి రమ్మన్నవాడివి’ అని చమత్కరించాడట. తాపీ ధర్మారావు, ఆరుద్ర కొన్ని సినిమాలకు కలిసి రాశారు. టైటిల్స్‌లో వాళ్ల పేర్లు ‘తాపీ, ఆరుద్ర’ అని పడినప్పుడు, ఆరుద్ర అందుకున్న చమత్కారం ఇది: ‘ఒకరు తాపీ, మరొకరు ఆదుర్దా.’ 

మరిన్ని వార్తలు