శ్వేతా తివారీ

27 Jan, 2020 02:22 IST|Sakshi

‘పనిలో అంకిత భావం ఉండాలి’ అనే మాట అర్థం కాని వారెవరైనా శ్వేతా తివారీ ఏం చెబుతున్నారో వింటే చక్కగా పనిలో పడిపోతారు. శ్వేత టీవీ నటి. గుర్తుకు రావడం లేదా? స్టార్‌ ప్లస్‌ వారి ‘కసౌటీ జిందగీ కే’ (జీవితం పెట్టే పరీక్షలు) హీరోయిన్‌. ఇంకా గుర్తుకు రావడం లేదా? హిందీ బిగ్‌ బాగ్‌ షోలో నాలుగో సీజన్‌ విజేత ఈవిడే! ఇప్పుడు కూడా మీకు గుర్తుకురాకపోతే.. ఈ ఫోటో చూసినా ఆమె గుర్తుకు రారు. ఎందుకంటే.. అప్పటికీ ఇప్పటికీ శ్వేత బాగా స్లిమ్‌ అయ్యారు. పోనీ ‘బెగుసరాయ్‌’ డైలీ టీవీ సీరియల్‌ జ్ఞాపకం ఉందా? 2015–2016 మధ్య జీటీవీ (అండ్‌ టీవీ) వచ్చింది.

అందులో శ్వేత వేశ్య పాత్రధారి. ‘ఎలా ఒప్పుకుంటారు?’ అలా చేయడానికి అని ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ పాత ప్రశ్ననే ఓ వెబ్‌ షోలో  శ్వేతను కొత్తగా అడిగారు షోకి వచ్చినవారు. ఆ సందర్భంలోనే ‘పనిలో అంకిత భావం’ గురించి మాట్లాడారు శ్వేత. ‘‘పని నాకు దైవంతో సమానం. ఆ రోజు నేను ఉపవాసం ఉన్నా కూడా.. క్యారెక్టర్‌ కోసం అవసరమైతే మాంసాహారం కూడా తింటాను’’ అని చెప్పారు. టీవీ నుంచి వచ్చిన శ్వేత ఇంకో మాట కూడా చెప్పారు.. ఎప్పటికీ టీవీని విడిచిపెట్టి పోనని! ఇది కూడా అంకిత భావమే కానీ, వృత్తి నిబద్ధత అంటే ఇంకా బాగుంటుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా