ధూమపానానికి దూరం కాకుంటే.. 

15 Jul, 2018 18:12 IST|Sakshi

లండన్‌ : ధూమపానంతో గుండె కొట్టుకునే వేగం లయతప్పే ఊప్రమాదం 45 శాతం అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. రోజుకు తాగే ప్రతి పది సిగరెట్లతో ఆర్టియల్‌ ఫిబ్రిలేషన్‌గా పిలువబడే అసంబద్ధ హార్ట్‌బీట్‌ ముప్పు 14 శాతం పెరుగుతుందని అథ్యయనం పేర్కొంది.

పొగతాగడంతో వచ్చే పెనుముప్పు కారణంగా మీరు ఇప్పటికే పొగతాగుతుంటే తక్షణమే దాన్ని మానివేయాలని, పొగతాగకుంటే అసలు దాని జోలికెళ్లొద్దని అథ్యయన రచయిత, ఇంపీరియల్‌ కాలేజ్‌కు చెందిన డాక్టర్‌ డాగ్‌ఫిన్‌ అనే స్పష్టం చేశారు.

స్మోకింగ్‌తో ఆర్టియల్‌ ఫిబ్రిలేషన్‌ రిస్క్‌ అధికమని, అయితే పొగతాగడానికి తక్షణమే స్వస్తిపలకడం ద్వారా దీన్ని నివారించవచ్చని అన్నారు.  ప్రపంచంలోని ప్రాణాంతక స్ర్టోక్ట్స్‌లో 30 శాతం ఆర్టిఫిషియల్‌ ఫిబ్రిలేషన్‌ వల్లనే ముంచుకొస్తున్నాయని చెప్పారు. అథ్యయన వివరాలు యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ కార్డియాలజీలో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు