చెవిలో గుయ్‌మనే శబ్దం వస్తోంది...

15 Jul, 2014 00:57 IST|Sakshi
చెవిలో గుయ్‌మనే శబ్దం వస్తోంది...

డాక్టర్ సలహా
నాకు రెండు నెలల నుంచి ఎడమచెవిలో గుయ్ మని శబ్దం వస్తోంది. నాకు చెవి నొప్పి కానీ, వినికిడి సమస్య కానీ లేదు. అయితే చెవిలో శబ్దంతో పనిచేయలేకపోతున్నాను. సరైన సలహా ఇవ్వగలరు.  - వినీల్, ముంబయి

చెవిలో శబ్దం రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే మీరు చెప్తున్న ప్రాథమిక వివరాలను బట్టి, ఇటీవల మా దగ్గరకు వస్తున్న చెవి సమస్యలను బట్టి చూస్తే మీది సెల్‌ఫోన్ వాడకం ఎక్కువ కావడం వల్ల వచ్చిన సమస్యగా పరిగణించాల్సి వస్తోంది. ఇటీవల మా దగ్గరకు వస్తున్న పేషెంట్లలో ఎక్కువ మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు.

ముఖ్యంగా 25-30 ఏళ్ల వయసు వారిలో ఈ సమస్యకు కారణం... విపరీతంగా సెల్‌ఫోన్ మాట్లాడడం, రణగొణధ్వనుల్లో పని చేయాల్సి రావడం లేదా అలాంటి వాతావరణంలో నివసించడం వలన వస్తుంది. ఈ సమస్యను ‘టినైటస్’ అంటారు. ఈ సమస్యలో మొదట హైఫ్రీక్వెన్సీ శబ్దాలను సరిగ్గా వినలేకపోతారు. క్రమంగా మిగిలిన ఫ్రీక్వెన్సీలను కూడా. మీరు వెంటనే దగ్గరలో ఉన్న ఈఎన్‌టీ వైద్యనిపుణులను సంప్రదించి, చెవి పరీక్షలు చేయించుకోండి. సమస్యను నిర్ధారించుకున్న తర్వాత తగిన చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.
 - డాక్టర్ ఇ.సి. వినయ్‌కుమార్, ఈఎన్‌టి నిపుణులు

మరిన్ని వార్తలు