పులిపిర్లా... ఇలా ట్రై చెయ్యండి!

20 Feb, 2019 00:17 IST|Sakshi

బ్యూటిప్స్‌

మన వంటి మీద అక్కడక్కడ పులిపిర్లు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇవి వాటంతటవే తగ్గిపోతాయి కానీ కొంతమందిలో ఏళ్ల తరబడి ఉండి, బాధిస్తాయి. ఇవి చేతులపైన, మెడమీద, ముఖం మీద ఎక్కువగా కనిపిస్తూ, అందవికారంగా మార్చేస్తాయి. పులిపిర్ల నివారణకు అనేక రకాల చికిత్సలు ఉన్నాయి కానీ, కొన్ని చిట్కాల ద్వారా కూడా వాటిని నివారించుకోవచ్చు. 

∙ముఖంపైన, మెడ మీద పులిపిరి కాయలు ఉన్నవారు దాల్చిన చెక్కను కాల్చి ఆ బూడిదని కొంచెం సున్నంలో కలిపి, దానికి కొన్ని బొట్లు నూనె కలిపి, వాటిపైన రాస్తే అవి రాలిపోతాయి.
∙అల్లాన్ని సన్నగా చెక్కి, సున్నంతో అద్ది పులిపిరిపై పెడుతుంటే క్రమంగా రాలిపోతాయి.
∙కాలిఫ్లవర్‌ను గ్రైండ్‌ చేసి రసం తీసి, ఆ రసాన్ని  వీలైనన్ని సార్లు పులిపిర్లపై రాస్తుంటే  మచ్చలు, గుంటలు పడకుండా రాలిపోతాయి. 
∙మందంగా ఉన్న పులిపిరి కాయలమీద ఆవాలు నూరిన ముద్ద రాస్తే సరి, అవి ఎండి రాలిపోతాయి.
∙రావి చెట్టు ఫై బెరడును కాల్చి బూడిద చేసి, దానికి సున్నపు నీటి తేటను కలిపి నిల్వ చేసుకుని తగినంత మిశ్రమంలో కొద్దిగా నెయ్యి వేసి దాన్ని పులిపిరిపై రాస్తూ ఉంటే అవి రాలిపోతాయి.
కొందరికి కొన్ని రోజులకే మంచి ఫలితం కనిపించవచ్చు. ఇంకొందరికి ఎక్కువకాలం పట్టొచ్చు. ప్రయత్నించి చూడండి. 

మరిన్ని వార్తలు