కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియకు ఊతం..

8 Sep, 2018 00:23 IST|Sakshi

సూర్యుడి నుంచి వెలువడే శక్తిని ఇంధనంగా మార్చుకోవడంలో చెట్ల ఆకులకు మించినవి ఇప్పటివరకు లేవు. సోలార్‌ ప్యానెల్స్‌ కూడా ఆకుల స్థాయిలో సూర్యుడి కిరణాలను విద్యుత్తుగా మార్చగలిగితే విద్యుచ్ఛక్తి ఫ్యాక్టరీల అవసరం అస్సలు ఉండదు. ఈ అద్భుతాన్ని సాధించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కీలక విజయం సాధించారు. కొన్ని కోట్ల సంవత్సరాల కిత్రమే మొక్కల్లో నిద్రాణమైపోయిన కొన్ని ఎంజైమ్‌లను మళ్లీ చైతన్యవంతం చేయడం ద్వారా ఆకుల నుంచి మరింత ఎక్కువ ఇంధనాన్ని తయారుచేయవచ్చునని వీరు గుర్తించారు.

ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని తాము ఆకుల్లా పనిచేసే ఒక యంత్రాన్ని తయారుచేశామని సూర్యుడి వెలుతురులోని ఎరుపు, నీలి రంగులను మాత్రమే శోషించుకునే హైడ్రోజనేస్‌ ఎంజైమ్‌ను వాడటం ద్వారా తాము మంచి ఫలితాలు సాధించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కటర్‌జైనా సోక్‌ చెబుతున్నారు. నాచుమొక్కల్లో ఉండే ఈ హైడ్రోజనేస్‌ ఎంజైమ్‌ కాంతి కిరణాల్లోని ప్రోటాన్లను హైడ్రోజన్‌గా మారుస్తుందని ఆమె వివరించారు. ఈ ఎంజైమ్‌ను యంత్రంలో ఉపయోగించినప్పుడు నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌లుగా విడగొట్టడం చాలా సులువైందన్నారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ యంత్రం పనితీరును మెరుగుపరిచేందుకు అవకాశముందని, అన్ని రకాల కాంతులతోనూ పనిచేసేలా చేస్తే ఇంధనంగా ఉపయోగపడే హైడ్రోజన్‌ను మరింత ఎక్కువ ఉత్పత్తి చేయవచ్చునని వివరించారు. భవిష్యత్తులో దీన్ని సోలార్‌ ప్యానెల్స్‌లోనూ వాడవచ్చునని అన్నారు. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

మేనత్త పోలిక చిక్కింది

ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం

టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...!

వినియోగదారుల అక్కయ్య

‘జర్నలిస్ట్‌ కావాలనుకున్నా’

సోపు.. షాంపూ.. షవర్‌ జెల్‌..అన్నీ ఇంట్లోనే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’