పచ్చి మిర్చిని పచ్చిగా తినడమా? అనుకోవద్దు!.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

17 Nov, 2023 16:32 IST|Sakshi

పచ్చిమిర్చి అంటే అబ్బా!.. ఘాటు అని తేలిగ్గా తీసిపారేయొద్దు. ఎందుకంటే మిగతా కాయగూరల్లానే దీనిలోనూ ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేగాదు రోజు ఓ పచ్చిమిరపకాయను పచ్చిగా తింటే ఎంతో మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

మనం పచ్చిమిర్చిని ఘాటు కోసం వాడతాం. ఇది మన ఆహారానికి మంచి స్పైసీని కాదు కావల్సినన్ని పోషకాలను అందిస్తుంది. ఇందులో విటమిన్‌ ఏ, సీలో తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇది జీక్రియలను పెంచి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేగాదు ఇందులో ఉండే క్యాప్సైన్‌ మెటబాలిజం పెంచెందుకు దోహదపడుతుంది. అందువల్ల దీన్ని ఆహారంలో చేర్చడం వల్ల బరువు నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

తత్ఫలితంగా క్యాలరీలు ఈజీగా బర్న్‌ అవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఈ పచ్చి మిర్చి కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధనలో తేలింది. అదే సమయంలో శరీరానికి వేడి చేసేలా కాకుండా తగిన మోతాదులో తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. ముక్కలు చేసిన పచ్చి మిరపకాయల నీటిని సేవించడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది.

అలాగే మీరు తీసుకునే సలాడ్స్‌లో గ్రీన్‌ చిల్లీ స్మూతి రుచిని పెంచడమే గాక ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో సహాయపడుతుంది. కొలస్ట్రాల్‌ స్థాయిలను, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కూడా. ఈ స్పైసీ పదార్థాలను ఎప్పుడూ సరైన పద్ధతిలో వినియోగిస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనేది గుర్తించుకోవాలి. 

(చదవండి: రోజూ ఓ కప్పు స్ట్రాబెర్రీలు తీసుకుంటే..డిమెన్షియా పరార్‌!)


 

మరిన్ని వార్తలు