-

టీ బ్యాగ్స్... చర్మానికి మేలైన పోషణ...

28 Oct, 2015 23:42 IST|Sakshi
టీ బ్యాగ్స్... చర్మానికి మేలైన పోషణ...

చర్మసౌందర్యానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి అనుకుంటారు చాలా మంది. కానీ, సమయం లేదనో, తప్పనిసరి అనో హడావిడిగా పనులు ముగించేస్తుంటారు. ఆ తర్వాత తొందరపడ్డామే అనుకుని బాధపడుతుంటారు. చిన్నవే అయినా సౌందర్యపోషణలో తరచూ చేసే కొన్ని తప్పులను ఇలా సవరించుకోవచ్చు..
 
{Xన్ టీ తాగుదామని తెచ్చుకొని, నచ్చక ఆ బ్యాగ్స్‌ని పడేస్తుంటారా? టీ బ్యాగ్స్‌ని పడేయకుండా ఈ సారి వాటిలో కొన్నింటిని టబ్ నీళ్లలో వేసి, అందులో కాసేపు మీ పాదాలను ఉంచండి. పాదాలు రిలాక్స్ అవుతాయి. మురికి వదిలి, పై చర్మం నునుపుగా మారుతుంది.హెయిర్‌కలర్‌ని ఉపయోగిస్తున్నారా? అయితే ముందుగా ప్యాచ్‌టెస్ట్ చేసుకోండి. మీరు ఏ రంగైతే జుట్టుకు వేసుకోవాలనుకుంటున్నారో దానిని కొద్దిగా చెవి వెనుకభాగంలో రాసి చూడండి. 24 గంటల పాటు అలాగే వదిలేయండి. చర్మంపై దురద, దద్దుర్లు లేవంటే మరుసటి రోజు ఆ కలర్ ని నిరభ్యంతరంగా వాడవచ్చు. కలర్ వేసుకున్నాక చర్మసమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఇదో చిన్న టెక్నిక్.
     
రోజులో ఎక్కువ గంటలు లిప్‌స్టిక్‌తో ఉండక తప్పనిసరా? అయితే, లిప్‌స్టిక్ తొలగించిన ప్రతీసారి స్వీట్ ఆల్మండ్ ఆయిల్‌ని దూది ఉండతో తీసుకొని, పెదాలకు సున్నితంగా రాయండి. దీని వల్ల లిప్‌స్టిక్‌లో ఉండే రసాయనాలు పెదాల చర్మాన్ని దెబ్బతీయకుండా కాపాడుకోవచ్చు.
మీ చర్మం మొటిమల వల్ల జిడ్డుగా, మరింత నల్లగా కనపడుతుందా? ఈ సమస్యకు విరుగుడుగా ఫేస్‌వాష్ నుంచి మేకప్ వరకు అన్నీ ఆయిల్ ఫ్రీ ఉత్పత్తులను ఉపయోగించండి. అలాగే, ప్రతి రోజూ ఉదయాన్నే మగ్ గోరువెచ్చని నీటిలో మూడు - నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి ముఖాన్ని శుభ్రపరచండి. చర్మం తరచూ పొడిబారుతోందా? ఆవనూనెను శరీరమర్దనలో ఉపయోగిస్తారు. చర్మం పగుళ్లు, పిగ్మెంటేషన్  వంటివి నివారిస్తుంది. వారానికి ఒకసారి ఆవనూనెతో ముఖాన్ని, దేహాన్ని మర్దన చేసుకుంటే ఒత్తిడి నుంచి రిలీఫ్ కలుగుతుంది.
 

మరిన్ని వార్తలు