రారండోయ్‌

10 Dec, 2018 00:45 IST|Sakshi
  •  ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ మహాసభలు 2019 జూలై 4, 5, 6 తేదీల్లో వాషింగ్టన్‌లో జరగనున్న సందర్భంగా రెండు లక్షల రూపాయల బహుమతితో నవలల పోటీ ప్రకటించింది. తెలుగు వారి జీవితాన్ని ప్రతిబింబించాలి. పేజీల పరిమితి లేదు. రచయిత పేరును రచనపై కాకుండా కవరింగ్‌ లెటర్‌ మీద మాత్రమే రాయాలి. రచనలు అందవలసిన ఆఖరు తేది: మార్చి 30. చిరునామా: అక్షర క్రియేటర్స్, ఏజీ–2, ఎ బ్లాక్, మాతృశ్రీ అపార్ట్‌మెంట్స్, హైదర్‌గూడ, హైదరాబాద్‌–29. వివరాలకు: 9849310560. tana.novel.2019 @gmail.com కు కూడా పంపవచ్చు.
  • కాంచనపల్లి కథాసంపుటి ‘ఓ వర్షం కురిసిన రాత్రి’ ఆవిష్కరణ, ఆయన పదవీ విరమణ ఉత్సవం డిసెంబర్‌ 10న సాయంత్రం 6 గంటలకు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరగనుంది. నిర్వహణ: పాలపిట్ట బుక్స్‌.
  • తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా కావ్య పరిమళం పరంపరలో భాగంగా డిసెంబర్‌ 14న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో వానమామలై జగన్నాథాచార్యుల ‘రైతు రామాయణం’పై డాక్టర్‌ గండ్ర లక్ష్మణరావు ప్రసంగిస్తారు. 
  • మంజు యనమదల ‘అంతర్లోచనాలు’ ఆవిష్కరణ డిసెంబర్‌ 15న సా. 6 గంటలకు టాగూర్‌ స్మారక గ్రంథాలయం, విజయవాడలో జరగనుంది. ఆవిష్కర్త: మండలి బుద్ధప్రసాద్‌. నిర్వహణ: నవ్యాంధ్ర రచయితల సంఘం. 
  • డాక్టర్‌ ప్రసాదమూర్తి కవితా సంపుటి ‘దేశం లేని ప్రజలు’ ఆవిష్కరణ డిసెంబర్‌ 16న సా. 5:30 కు హైదరాబాద్‌ బుక్‌ ఎగ్జిబిషన్‌లో జరగనుంది. 
  • రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారాన్ని రామా చంద్రమౌళి కథాసంపుటి ‘తాత్పర్యం’కు ప్రకటించారు. ఫిబ్రవరి 2019లో సిరిసిల్లలోని రంగినేని చారిటబుల్‌ ట్రస్ట్‌లో జరిగే కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేస్తారు.
  • 2018 విమలాశాంతి సాహిత్య పురస్కారాలను శిఖామణి ‘చూపుడువేలు పాడే పాట’, ఇబ్రహీం నిర్గుణ్‌ ‘ఇప్పుడేదీ రహస్యం కాదు’ కవితా సంపుటాలకు ప్రకటించారు.
  • శశిశ్రీ స్మారక సాహిత్య పురస్కారం 2019ని ఆధునిక సాహిత్య అనువాద గ్రంథాలకు ఇవ్వనున్నారు. 2016 జనవరి నుండి 2018 డిసెంబర్‌ మధ్య ప్రచురించిన పుస్తక నాలుగు ప్రతులను జనవరి 30లోగా ‘షేక్‌ మస్తాన్‌వలి, 38/712, పి.ఎస్‌.నగర్, సెంట్రల్‌ విజన్‌ పోస్ట్, కడప–2’ చిరునామాకు పంపాలి. పురస్కార విలువ పదివేలు. వివరాలకు: 9704073044
  •  కవిత విద్యా సాంస్కృతిక సేవా సంస్థ, కడప– గురజాడ కథా, కందుకూరి నవలా, శ్రీశ్రీ కవితా, జానమద్ది సాహిత్య, రావూరి భరద్వాజ బాల సాహిత్య పురస్కారాలకు 2016–18 మధ్య ప్రచురించిన పుస్తకాలను ఆహ్వానిస్తోంది. పురస్కార విలువ ఒక్కోటీ ఐదు వేలు. మూడు ప్రతులు పంపాలి. చివరి తేది: డిసెంబర్‌ 31. చిరునామా: బోయపాటి దుర్గాకుమారి, 42/169, ఎన్జీవో కాలనీ, కడప–2. ఫోన్‌: 08562–253734 
మరిన్ని వార్తలు