16న సేంద్రియ కూరగాయల సాగుపై శిక్షణ

11 Feb, 2020 07:08 IST|Sakshi

సేంద్రియ వ్యవసాయ విధానంలో కూరగాయలు, ఆకుకూరల సాగుపై ఫిబ్రవరి 16 (ఆదివారం)న గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ఉద్యాన శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజాకృష్ణారెడ్డి, సేంద్రియ రైతు శివనాగమల్లేశ్వరరావు(గుంటూరు జిల్లా) ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255

సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై 5 రోజుల శిక్షణ
సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.ఎస్‌.ఎ.), గ్రామీణ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపార నిబంధనలపై ఫిబ్రవరి 17 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్‌లో శిక్షణ  ఇవ్వనున్నట్లు సి.ఎస్‌.ఎ. ఈడీ డా. జీవీ రామాంజనేయులు తెలిపారు.
వివరాలకు: 85006 83300

మరిన్ని వార్తలు