ఊపిరి తీసుకోనివ్వండి

17 Jun, 2019 08:02 IST|Sakshi

స్త్రీ అంటే దేహం మాత్రమేనా! ఆమెకూ మనసు ఉంటుందని..ఆమె దేహం చుట్టూ మనం కప్పే ఆంక్షలన్నీ ఆమె మనసుకు ఊపిరి ఆడకుండా చేస్తాయని.. ఎందుకు గ్రహించలేం?!  ఎందుకంటే.. దేహాన్ని తప్పమనసును చూడలేం మనం! అందుకే ఆ మనసును దేహం పైకి తెచ్చి చూపిస్తున్నారు ఈ అమ్మాయిలు.

కొన్ని నెలల కిందట...
ఢిల్లీ.. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలోని ఆడిటోరియం.. జరగబోయే కార్యక్రమం ఏంటో అనే ఉత్కంఠను పంచుకుంటున్నారు ప్రేక్షకులు లోగొంతుకలతో. అంతలోనే ఆడిటోరియం లైట్లన్నీ ఆరిపోయి చీకటి అయిపోయి.. వేదిక మీద ఒక మహిళ నిలబడి ఉంది నగ్నంగా. ఆమె దేహం మాత్రమే ఫోకస్‌లో ఉంది. ఒక్కసారిగా ప్రేక్షకుల్లో నిశ్శబ్దం. దిగ్భ్రాంతిగా చూస్తున్నారు ఆ ఫోకస్‌కేసి. నెమ్మదిగా వేదిక మీది స్త్రీ.. తన చుట్టూ తాను తిరగడం మొదలుపెట్టింది.. ప్రేక్షకుల కేసి చూస్తూ.. గుచ్చి గుచ్చి! దాదాపు అందరూ ఆమె మీద నుంచి తమ దృష్టి మరల్చుకోవడానికి ప్రయత్నించారు రకరకాలుగా.
అప్పుడు ఆమె మాట్లాడ్డం మొదలుపెట్టింది.

‘‘చిన్నప్పటి నుంచీ మా ఇంట్లో నా మీద స్పెషల్‌  అటెన్షనే’’ అంటూ పక్కనే ఓ కుర్చీమీద ఉన్న బట్టల బుట్టలోంచి ఓ చున్నీ తీసి నడుముకు బిగించుకుంది. ‘‘అన్నావాళ్లతో సమానంగా .. వాళ్లతో కలిసి ఆడుకుంటూంటే.. ఆడపిల్లవు.. మగపిల్లలతో కలిసి ఆ గంతులేంటి?’’ అని నా రెక్కలు పుచ్చుకుని బరబరా లోపలికి లాక్కెళ్లేవారు’’ అని చెప్తూ ఇంకో చున్నీ కట్టుకుంది. ‘‘ఫ్రెండ్స్‌తో కలిసి జోకులేసుకుంటూ మనసారా నవ్వుకుంటూంటే.. అమ్మాయిలు అంత బిగ్గరగా నవ్వొచ్చా’’ అని నోరు మూసేశారు అంటూ ఇంకో చున్నీ చుట్టుకుంది. ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే.. చీకటి పడకముందే ఇంటికొచ్చేయ్‌.. అని హద్దు చెప్పారు  అంటూ మరో చున్నీ, నచ్చిన డ్రెస్‌ వేసుకుంటుంటే.. ఇలా కాదు.. నిండుగా వేసుకోవాలి.. అంటూ  భుజాల చుట్టూ దుపట్టా కప్పేశారు.. అని చెప్తూ ఇంకో చున్నీ, తలెత్తి.. ఛాతీ విరుచుకొని నడుస్తుంటే.. తల వంచి.. నెత్తి మీద నుంచి ఘూంఘట్‌ కప్పేశారు..

అంటూ మరో చున్నీ, బస్‌స్టాప్‌లో నిలబడ్డా.. కాలేజ్‌కి.. ఆఫీస్‌కు.. సినిమాకు.. ఇంకెక్కడికి వెళ్లినా సరే.. తల వంచే ఉండాలి.. నిండుగా బట్టలు వేసుకోవాలి.. ఈ ప్రయాణంలో ఎదురుపడ్డ మగవాళ్లను ‘అన్నా’ అనే పిలవాలి.. అలా అయితేనే నువ్వు సురక్షితంగా ఉంటావ్‌’’ అని చెప్పారు మా పెద్దలు’’ అంటూ గుక్క తిప్పుకోకుండా చెబుతూ ఆ కుర్చీ మీది బుట్టలో చున్నీలన్నీ చుట్టుకుంది. బట్టలన్నీ వేసుకుంది. పాదం నుంచి మెడ దాకా.. మేను కనిపించకుండా.. ఊపిరి తీసుకోవడం కష్టమయ్యేంతగా ! తల మీద హెల్మెట్‌ కూడా పెట్టుకుంది. కళ్లకు చలువ కళ్లజోడు ధరించింది. ‘‘కనిపించిన అందరినీ ‘అన్నా’ అనే పిలుస్తున్నా.. మనదేశ సంస్కృతీసంప్రదాయానికి ప్రతిరూపంలా ఉన్నావ్‌ అని కితాబూ అందుకుంటున్నా. ఇక నన్నెవడైనా టీజ్‌ చేసినా.. దాడి చేసినా.. వేధించినా నా బాధ్యత కాదు’’ అని ఆపేసింది ఆమె. శ్వాస తీసుకోవడం కష్టమై ఎగబీలుస్తోంది.. వెళ్లి గబగబా ఆ బట్టలన్నీ లాగిపడేస్తే కాని హాయిగా ఊపిరి పీల్చుకోదేమో అన్నట్టుంది పరిస్థితి. ఆమె.. ఆర్టిస్ట్‌ మల్లికా తనేజా.


ఈ మధ్యే..
హైదరాబాద్‌.. జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో.. దాదాపు 75 ఏళ్ల తర్వాత  మొదటిసారిగా.. పెయింటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌ను నిర్వహించింది. ఆ పండగలో కనిపించిన బాడీ పెయింటింగ్స్‌ను వీక్షకుల మనసును తడి చేశాయి. మెదళ్లలో ఆలోచనలను రేకెత్తించాయి. పదేళ్ల చిన్నారి వీపు మీద అరచేయి ప్రింట్‌ ఉంటుంది. ‘‘చైల్డ్‌ అబ్యూజ్‌ని ఆపమన్నట్టు’’గా. చేతిలో లిప్‌స్టిక్‌తో ఉన్న పందొమ్మిదేళ్ల అమ్మాయి వీపు మీద లేబుల్‌ కనిపిస్తూంటుంది.. తనకు నచ్చినట్టుగా అలంకరించుకున్న అమ్మాయిని ‘ఫలానా’ అంటూ ముద్ర వేయడం బంద్‌ చేయమని. ఒక అబ్బాయి వీపు మీదున్న రెయిన్‌బో కలర్స్‌ను ‘‘ఎల్‌జీబీటీ హక్కులు’గా.. మరో అమ్మాయి వీపు మీదున్న వెజైనా విత్‌ వింగ్స్‌  బొమ్మ... సమానత్వానికి చిహ్నంగా, ఇరవై రెండేళ్ల యువతి వీపు మీద ఎర్రటి రంగు గీత.. రుతుక్రమం మీదున్న అపోహలను తొలగించుకోమన్నట్టుగా.. మరో యువతి వీపు మీద మల్టీ కలర్స్‌  అబ్‌స్ట్రాక్ట్‌ పెయింటింగ్‌ స్త్రీల మీద జరుగుతున్న దాడులు, హింసకు ప్రతిబింబంగా.. ఓ నడి వయసు మహిళ వీపుమీది గర్భస్థ శిశువు బొమ్మ భ్రూణ హత్యలను ఆపమని కోరుతూ ఉన్న పెయింటింగ్స్‌ అవి. ఆర్టిస్ట్‌లు..  సాహితీ కల్యాణం, విస్మయ వాసుదేవన్‌.

అయితే...?
ఏం లేదు. మల్లికా ప్రదర్శన అయినా.. సాహితీ, విస్మయల పెయింటింగ్స్‌ అయినా ప్రకటిస్తున్నదొకటే.. నిరసన.. సమానత్వం కోసం తపన. సంస్కృతీ సంప్రదాయాలను మోసే భారం ఆడపిల్ల మీదే ఎందుకు? ఊపిరి తీసుకోలేనంతగా ఆమె మీద పరువు ప్రతిష్టల బరువును మోపడపెందుకు? ఆధిపత్య అహంకారంతో మగవాడు చేసే గాయాలను ఆడపిల్లల కట్టు, బొట్టుతో ఎందుకు లింక్‌ పెడ్తారు? ఆ కట్టుబాట్లలో ఎందుకు బందీ చేస్తారు.. అని సమాజానికి చేసిన హెచ్చరిక.. కొట్టిన చెంపదెబ్బ! ఆడవాళ్ల ఆత్మఘోషకిచ్చిన రూపం. దేశంలో ఏ అమ్మాయి మీద దాడి జరిగినా ఆ నేరాన్ని ఆమె వేసుకున్న బట్టలకో.. ఆమె ఉపయోగించుకున్న స్వేచ్ఛకో అంటగట్టే  యాటిట్యూడ్‌కు  చూపించిన సమాధానం. సమాజపు విపరీత ధోరణుల వల్ల ఫిమేల్‌ జెండర్‌ ఉనికే ప్రమాదంలో పడ్తున్న తీరును ఈ వ్యక్తీకరణలు చూపిస్తున్నాయి. అసమానతలను  ప్రశ్నిస్తున్నాయి. నిలదీస్తున్నాయి. తారతమ్యాలు వద్దని కోరుతున్నాయి.

బట్టల్లో కాదు చూపుల్లో తేడా
అమ్మాయిలు వేసుకున్న బట్టలే వాళ్ల పట్ల నేరాలకు ప్రేరేపిస్తే.. అయిదేళ్ల పాపలనూ ఎందుకు రేప్‌ చేస్తున్నారు? సో.. బట్టలు కాదు.. చూసే చూపుల్లో తేడా ఉంది. తల వంచుకునే ఉండాలి అని అమ్మాయిలకు చెప్పే బదులు.. అమ్మాయిలనూ గౌరవించాలి.. వాళ్లూ మీకు ఈక్వలే.. సెక్సువల్‌ ఆబ్జెక్ట్స్‌ కాదు అని ఎందుకు నేర్పరు? నేర్పేందుకే ఇలాంటి ప్రదర్శనలు.. దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా ఇస్తున్నాను.
– మల్లికా తనేజా

మానవత్వం.. శాంతే మా మనవి
మా పెయింటింగ్స్‌ ఇప్పుడున్న సోషల్‌ సిస్టమ్‌ను రిఫ్లెక్ట్‌ చేసేవే. మనోవికాసం, ఆత్మీయతానురాగాలు, అనుభూతులకు లింగభేదాలు లేవు. ఆడ, మగ, ఎల్‌జీబీటీ.. అందరికీ ఒకటే. సమాజానికి  సమానత్వమే ప్రాతిపదిక కావాలి. మానవత్వం, ప్రేమ, శాంతికి మాత్రమే చోటుండాలి. మా పెయింటింగ్స్‌ ద్వారా మనవి చేయాలనుకున్నది ఇదే’’  
– విస్మయ వాసుదేవన్, సాహితీ కల్యాణం

కాలం మారింది.. రహస్యంగా ఉంచడం, దాచడం.. చాలా పొరపాట్లకు, ఎన్నో తప్పిదాలకు కారణమని తెలుసుకుంటోంది యువత. దేన్నయినా.. చర్చించాలి.. భావాలను స్వేచ్ఛగా ప్రకటించాలి. అందుకు వాళ్లు కళను మంచి మాధ్యమంగా ఎంచుకుంటున్నారు. నిజానికి స్వాతంత్య్ర సమరం నుంచి ఎన్నో సామాజిక ఉద్యమాలకు ఆక్సిజన్‌లా పనిచేసి వాటిని ప్రాణాలతో నిలిపి ఉంచినవి కళలే. ఆ నిజాన్ని ఈ తరమూ గ్రహించింది. అందుకే వాళ్ల ఎక్స్‌ప్రెషన్స్‌కు.. వాళ్లకు తెలిసిన... అనుభవం ఉన్న కళలను వేదికగా మలచుకుంటున్నారు.నిర్భయంగా.. స్పష్టంగా ప్రదర్శిస్తున్నారు.. సమానత్వం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. సైంటిఫిక్‌ అప్రోచ్‌ పెంచుతున్నారు.
– సరస్వతి రమ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

మేనత్త పోలిక చిక్కింది

ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం

టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...!

వినియోగదారుల అక్కయ్య

‘జర్నలిస్ట్‌ కావాలనుకున్నా’

సోపు.. షాంపూ.. షవర్‌ జెల్‌..అన్నీ ఇంట్లోనే!

హెచ్ఐవీకి మందు దొరికింది!

అర్బన్‌ నోస్టాల్జిస్ట్‌లు

పరిసరాలను ముంచెత్తేసిన పెళ్లి!

ఆ గర్భిణి... కళ్లలో మెదిలేది..

వెయిట్‌ లిఫ్టింగ్‌తో గుండెకు మేలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!