అగ్నిశక్తి!

8 Mar, 2015 23:03 IST|Sakshi
అగ్నిశక్తి!

వారి చేతల్లో శక్తిసామర్థ్యాలు కనిపిస్తాయి. వారి మాటల్లో పట్టుదల ప్రతిధ్వనిస్తుంది.
ఇటీవలే జార్ఖండ్‌లోని కాన్కెర్ జిల్లాలో ‘సిటిజెడబ్ల్యూసి’(కౌంటర్ టైజం అండ్ జంగిల్ వార్‌ఫేర్ కాలేజీ)లో శిక్షణ పూర్తి చేసుకున్న 44 మంది మహిళలతో మాట్లాడితే నిలువెత్తు ఆత్మవిశ్వాసంతో మాట్లాడినట్లే అనిపిస్తుంది. ఇందులో చాలామంది మహిళలు గ్రామాలు, పేదకుటుంబాల నుంచి వచ్చిన వారే. నలభై అయిదు రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకొని ‘కమెండో’ సర్టిఫికెట్ తీసుకున్న ఒక మహిళా ఆఫీసర్‌ను కదిలిస్తే-‘‘అడవిలోని గెరిల్లాలతో గెరిల్లాగా పోరాడడానికి మాలో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు’’ అన్నారు.
 
నాయకత్వ లక్షణాలలాంటి  మానసిక విషయాలతో పాటు లైట్ మెషిన్ గన్స్, సెల్ఫ్-లోడింగ్ రైఫిల్స్, ఎకె-47 రైఫిల్స్, అండర్-బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్స్, మోర్టార్స్, లైట్ వెపన్స్, హ్యాండ్‌గ్రానేడ్స్... తదితర అంశాల్లో ఆయుధశిక్షణ తీసుకున్నారు మహిళా కమెండోలు.
- ‘‘నేను శ్రీమతి సరస్వతి నిషాద్ నుంచి కమెండో నిషాద్‌గా మారిపోయాను’’ అన్నారు ఇరవై ఆరు సంవత్సరాల సరస్వతి గర్వంగా.
- సరస్వతి మాత్రమే కాదు మిగిలిన 43 మంది కూడా తమను తాము కొత్తగా చూసుకుంటున్నారు.
- ‘సబల’ అని నిరూపించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
 
కృతజ్ఞతాభివందనాలు
శనివారం... హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్ హాలులో సాక్షి మీడియా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ‘ఉమెన్స్ డే సెలబ్రేషన్స్’లో భాగంగా వివిధ విభాగాలకు సంబంధించిన పురస్కారాలను (అమ్మ, అర్ధాంగి, మహిళా రైతు) ‘ఉమెన్స్ వరల్డ్’ సమర్పించి, సహాయసహకారాలను అందించింది. వీరితోపాటు 91.1 ఎఫ్.ఎం. రేడియో సిటీ, జెఆర్‌సి కన్వెన్షన్స్ అండ్ ట్రేడ్ ఫేర్స్, నేచురల్స్ (ఇండియాస్ నెం.1 హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్), అనూస్... వేడుకల విజయానికి తమవంతు తోడ్పాటు అందించారు. వీరందరికీ ‘సాక్షి’ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తోంది.

మరిన్ని వార్తలు