ఆ యాంటీబయాటిక్‌తో గుండెకు ముప్పు

26 Feb, 2018 16:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూయార్క్‌ : యాంటీబయాటిక్స్‌ వాడకంపై భిన్న వాదనలు వినిపిస్తున్న క్రమంలో తాజాగా ఓ యాంటీబయాటిక్‌పై పదేళ్ల పాటు జరిపిన అథ్యయనంలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. బయాక్సిన్‌ బ్రాండ్‌ పేరిట విక్రయిస్తున్న క్లారిత్రోమైసిన్‌ హృద్రోగంతో బాధపడే రోగులకు పెనుముప్పుగా పరిణమించిందని తేలింది. ఇన్‌ఫెక్షన్ల చికిత్సకు వైద్యులు ఈ యాంటీబయాటిక్‌ను సహజంగా రిఫర్‌ చేస్తుంటారు. ఈ మందును వాడిన కొన్ని సంవత్సరాల తర్వాత సైతం హృద్రోగులకు ప్రాణాపాయం ముంచుకొస్తుందని ఎఫ్‌డీఏ హెచ్చరించింది. హృద్రోగాలతో బాధపడతే వారు ఈ డ్రగ్‌ను రెండు వారాల కోర్సుగా తీసుకున్న క్రమంలో ఏడాది లేదా తర్వాతి కాలంలో గుండె పోటు లేదా హఠాన్మరణానికి గురైనట్టు పదేళ్ల పాటు నిర్వహించిన అథ్యయనంలో వెల్లడైంది.

2005లోనే క్లారిత్రోమైసిన్‌ దుష్పరిణామాలపై ఎఫ్‌డీఏ హెచ్చరించింది. ఇక గుండె సమస్యలతో బాధపడే రోగులకు ఈ మందు చేసే మేలు కంటే కీడే అధికమని ఎఫ్‌డీఏ గుర్తించింది. ఈ డ్రగ్‌ కారణంగా గుండె వేగంగా కొట్టుకుంటుందని, గుండెపోటు, ఆకస్మిక మరణానికి దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంది. 

Read latest Features News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా