దంతసిరి వర్రీ

2 Nov, 2014 23:09 IST|Sakshi
దంతసిరి వర్రీ

డాక్టర్స్ కాలమ్
వయసు మీదపడితే గానీ పంటి సమస్యలు వచ్చేవి కావు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ముప్పయ్ ఏళ్లకే దంత సమస్యలు తలెత్తుతున్నాయి. ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు వెరసి నూటికి డెబ్భయ్ శాతం మంది డెంటల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారు. దంత సమస్యలపై నిర్లక్ష్యం వహించడం ఇబ్బందులకు దారితీస్తోంది. హైదరాబాద్ వంటి మహానగరాల్లో కూడా డెంటల్ ప్రాబ్లమ్స్‌పై వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. దీంతో సమస్య తీవ్రమై వైద్యం ఖరీదవుతోంది. ముఖ్యంగా మారిన ఆహారపు అలవాట్లే దంత సమస్యలకు కారణం అవుతోందని ప్రముఖ దంత వైద్యుడు డా॥అంటున్నారు. నగరాల్లో శీతల పానీయాలు ఎక్కువగా తాగడం, ఆల్కహాల్ , సిగరెట్ తాగడం ఎక్కువగా ఉండటంతో ముప్పయ్ ఏళ్లలోనే దంత సమస్యలు పలకరిస్తున్నాయని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే మెట్రోనగరాల్లో దంతసిరి బాధితులు ఎక్కువగా ఉన్నారని ఆయన చెబుతున్నారు.
 
ఇలా సమస్యలు...
* చాలామంది శీతల పానీయాలు (సాఫ్ట్ డ్రింక్స్.. కోలాలు) వంటివి ఎక్కువ తీసుకుంటున్నారు.
* వీటిలో మోతాదుకు మించి ఉన్న చక్కెర పదార్థాలు పళ్లలో ఉండే బాక్టీరియాను పెంచుతుంది.
* నిల్వ ఉన్న ఆహార పదార్థాలు (బేకరీ ఫుడ్స్) ఎక్కువగా తీసుకుంటే దంత సమస్యలకు కారణం అవుతాయి.
* పొగతాగటం అలవాటున్న వారిలో ఎక్కువ మంది చిగుళ్ల సమస్యతో బాధపడుతున్నారు.
* ఐస్‌క్రీమ్స్, చాక్లెట్లు ఎక్కువగా తీసుకునేవారికి దంత సమస్యలు ఎదురవుతున్నాయి.
 
కాసింత శ్రద్ధ ఉంటే చాలు
* దంతసిరిని కాపాడుకోవాలంటే ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు విధిగా చేయించుకోవాలి
* ఉదయం, రాత్రి భోజనం తర్వాత విధిగా బ్రష్ వేసుకుంటే పళ్ల సందుల్లో ఆహార పదార్థాలు తొలగి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
* తరచూ కీరా, క్యారెట్‌తో పాటు ఆపిల్, నారింజ వంటి పళ్లు తీసుకోవడం పళ్లకు వ్యాయామమే కాకుండా, దంతాలకు

ఇవి బలాన్నిస్తాయి
* ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం వల్ల దంతాల పటుత్వం పెరుగుతుంది.
* అతి శీతలమైన నీటిని తీసుకోవడం మంచిది కాదు.

మరిన్ని వార్తలు