Dental Problems in Children : పాలు తాగని పిల్లలకు అలాంటి పేస్ట్‌ ఉపయోగించకండి

11 Nov, 2023 16:42 IST|Sakshi

దంతాలను శుభ్రంగా ఉంచుకుంటే చాలా వరకు వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే నోటి శుభ్రత మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దంతాల వ్యాధి కారణంగా అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు నోరు శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా చిన్న పిల్లల్లో దంతాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మరి పిల్లల దంతాలు శుభ్రం చేయడం ఎలా?అన్నది ప్రముఖ ఆయుర్వేద వైద్యులు నవీన్‌ నడిమింటి మాటల్లోనే..


చిన్న పిల్లలకు సాధారణంగా 8-9 నెలల వయసు నుంచి దంతాలు రావడం జరుగుతుంది. కొంత మందికి ముందుగా రావచ్చు. మరికొందరికి ఆలస్యంగా రావొచ్చు. పాలు తాగే వయసులో తొలిసారి వచ్చే దంతాలను పాలదంతాలు అంటారు. ఈ దశలో వీరికి వచ్చే దంతాలు అంతగా శుభ్రపరచవలసిన అవసరం లేదు.

► ఒక సంవత్సరం లోపు పిల్లలకు దంతాల కంటే ముఖ్యంగా నాలుకను శుభ్రపరచాలి, లేదంటే పాచి ఎక్కువగా ఉండి పాలు సరిగా తాగరు. నాలుకను శుభ్రపరచడానికి పెద్ద వాళ్ళు వేలిని పసుపులో అద్ది నాలుకపై రాస్తూ శుభ్రం చేస్తారు. లేదంటే మెత్తటి గుడ్డపై మౌత్ పేయింటు వేసి నాలుకపై రాసి శుభ్రం చేయొచ్చు

► పిల్లలు ఎప్పుడు పాలు తాగినా నోరు శుభ్రం చేసుకోడం నేర్పించాలి. రాత్రి పడుకునేముందు బ్రష్ చేసుకోవడం చాలా మంచి అలవాటు.

► సంవత్సరం దాటిన పిల్లలకు కూడా పూర్తి సంఖ్యలో దంతాలు రావు. వీరికి దంతధావనం చేయించడానికి సాధారణ బ్రష్ బదులు ఫింగర్ బ్రష్ ఉపయోగించడం మంచిది . ఇది రబ్బరులా మెత్తగా ఉండడం వల్ల వారి దంతాలకు , చిగుళ్ళకు ఎటువంటి హానీ జరగదు.

► సాధారణంగా పిల్లలకు తీపి పదార్థాలు అంటే మక్కువ ఎక్కువ కాబట్టి టూత్ పేస్ట్‌ను కూడా తింటారు. దీనికి నివారణగా మనం చేయాల్సింది తియ్యగా ఉన్న టూత్ పేస్ట్ ఉపయోగించకపోవడమే. కొద్దిగా కారంగా / ఘాటు రుచి గల టూత్ పేస్ట్ వాడాలి. లేదా తీపి లేని టూత్ పౌడర్ ను వాడడం ఉత్తమం.

► పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఇంట్లో తయారుచేసినవి పెట్టడానికే ఇష్టపడతారు. అలాగే టూత్ పౌడర్‌ను ఇంట్లో తయారు చేసుకుని వాడడం శ్రేయస్కరం. హోం మేడ్ టూత్ పౌడర్ తయారీ విధానం యూట్యూబ్ లో వీడియోలు రూపంలో అందుబాటులో ఉన్నాయి.ఏది మీకు, మీ పిల్లలకు సరిపడుతుందో లేదా నచ్చుతుందో దానిని తయారు చేసుకుని వాడుకోవచ్చు.

మరిన్ని వార్తలు