నాట్ ఏ బయోపిక్!

3 Apr, 2015 02:21 IST|Sakshi
నాట్ ఏ బయోపిక్!

సినిమాల కంటే వివాదాలు, సెక్సీ పోజులతోనే బాగా పాపులర్ అయిన బాలీవుడ్ గుమ్మ పూనమ్ పాండే ‘నషా’ తరువాత మరో సినిమాకు ఓకే చేసింది. ‘హెలెన్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంపై అప్పుడే రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అలనాటి ఐటెమ్ బాంబ్ ‘హెలెన్’ బయోగ్రాఫికల్ మూవీ ఇదని ప్రచారం జరిగిపోతోంది.

వీటికి ఫుల్‌స్టాప్ పెడుతూ... దీనిపై ఈ చిన్నది క్లారిటీ ఇచ్చింది. ‘హెలెన్‌జీ బయోపిక్ కాదీ చిత్రం. గ్రేట్ డ్యాన్సింగ్ నటి ఇన్‌స్పిరేషన్‌తో కనిపించే ఓ రోల్ అంతే. ఇంతకు మించి ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు బయటపెట్టలేను’ అంటూ చెప్పుకొచ్చింది పూనమ్ పాండే. బయోపిక్ కాదంటున్నా... ఇందులో హెలెన్ సూపర్ హిట్ నెంబర్ ఒకదానికి పూనమ్ స్టెప్పులేస్తుందనేది బీటౌన్ సమాచారం.
 

మరిన్ని వార్తలు