ఇలాగైతే ఎలా? | Sakshi
Sakshi News home page

ఇలాగైతే ఎలా?

Published Fri, Apr 3 2015 1:57 AM

ys jagan examined  Grass, feeding the cows

ఐజీ కార్ల్‌లో కలియదిరిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
భవనాలు నిరుపయోగమవుతుండటంపై ఆవేదన
మూడు గంటలపాటు పరిశీలించిన వైనం
ఇంటి వద్ద ప్రజలతో మమేకం


సాక్షి, కడప : పులివెందులలోని జేఎన్‌టీయూ సమీపంలోని పెద్దరంగాపురం వద్ద ఉన్న ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ఆన్ లైవ్‌స్టాక్(ఐజీ కార్ల్)ను గురువారం సాయంత్రం ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. అందమైన భవనాలు ఉన్నా.. నిరుపయోగంగా ఉండటాన్ని చూసి ఆయన చలించిపోయారు.

అద్భుతంగా నిర్మించి సిద్ధం చేసి ఉంచినా పరిశోధనలు జరగక ప్రయోజనం లేకుండా పడి ఉండటంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో కేడీ ప్రసాద్, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులతో కలిసి ఐజీ కార్ల్‌లోని ప్రతి విభాగాన్ని ఆయన పరిశీలించారు.

సెంట్రల్ పీవోటీ టెక్నాలజీని నిశితంగా పరిశీలించిన ప్రతిపక్షనేత

ఐజీ కార్ల్‌లోని పొలాల్లో అమలు చేస్తున్న సెంట్రల్ పీవోటీ టెక్నాలజీని జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. పీవోటీ సిస్టం ద్వారా ఒకేసారి వందల ఎకరాల్లో స్పింక్లర్స్ ద్వారా నీటి తడులు అందించవచ్చు. ప్రత్యేకంగా టెక్నాలజీతో రూపొం దించిన పీవోటీ సిస్టంలో భాగంగా టైర్లు పొలంలో చుట్టూ తిరుగుతుంటే.. వాటికి పైన అమర్చిన స్పింకర్ల ద్వారా నీరు పొలంపై పడుతూ ఉంటుంది.

ఈ సిస్టం రాష్ట్రంలో ఎక్కడా లేని నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కం పెనీ ప్రతినిధితోపాటు కాంట్రాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో కేడీ ప్రసాద్‌లతో చర్చిస్తూ వచ్చారు. అక్కడున్న నీటి సం ప్‌ను కూడా పరిశీలించడంతోపాటు పీవో టీ సిస్టంను ఆన్ చేయించి నీటి తడులు అందే విధానాన్ని కూడా పరిశీలించారు.

గడ్డి, దాణా, ఆవులను పరిశీలించిన జగన్

ఐజీ కార్ల్‌లో సాగు చేసిన వివిధ రకాల గడ్డి పొలాలను జగన్ పరిశీలించారు. మూడు, నాలుగు రకాల గడ్డిని ప్రయోగాత్మకంగా సాగు చేసిన నేపథ్యంలో వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ దాణా కేంద్రాలను కూడా ఆయన పరిశీలించారు. జీవీసీ, దొడ్ల డెయిరీల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆవులు, దూడల పెంపకాన్ని ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు.

సాధారణంగా ఇక్కడ పుట్టిన మరుక్షణమే దూడను తల్లినుంచి వేరు చేసి.. ప్రత్యేక విభాగంలో పెంచుతూ వస్తారు. ఆవులు, దూడలు ఉన్న రెండు కేంద్రాలలోకి వెళ్లి పరిశీలించారు. ఐజీ కార్ల్ మెయిన్ బిల్డింగ్ లోపలికి వెళ్లి.. ఐజీ కార్ల్‌కు సంబంధించిన నమూనాను పరిశీలించారు. భవనాల లోపల దుమ్ము పేరుకొని ఉండటాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.   లోపల లిఫ్ట్ సిస్టం, కాన్ఫరెన్స్ హాలు, ఇతర భవనాల పరిస్థితిని పరిశీలించారు.

వైఎస్ భాస్కర్‌రెడ్డి,వైఎస్ మనోహర్‌రెడ్డి ఇంట్లో కాసేపు

పులివెందులకు వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగమోహన్‌రెడ్డి, సతీమణి వైఎస్ భారతిరెడ్డి గురువారం మధ్యాహ్నం నేరుగా వైఎస్‌ఆర్‌సీపీ పులివెందుల నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. కాలు నొప్పితో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్న ఆయన్ను పరామర్శించారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గురువారం సాయంత్రం మున్సిపల్ మాజీ వైఎస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి ఇంటికి వెళ్లి కాసేపు గడిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మతో కూడా చర్చించారు.

చంద్రశేఖరరెడ్డి కుటుంబానికి పరామర్శ

ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం రాత్రి మాజీ హౌసింగ్ ఓఎస్డీ చంద్రశేఖరరెడ్డిని పరామర్శించారు. నాలు గు రోడ్ల సమీపంలో చెన్నారెడ్డి కాల నీలో నివసిస్తున్న చంద్రశేఖరరెడ్డికి ఈ మధ్యనే కాలు బెణికింది. ఆయన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్, వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డిలు ఆయన్ను పరామర్శించారు.

ఈ కార్యక్రమాలలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు నాగేళ్ల సాంబశివారెడ్డి, మున్సిపల్ వైస్ చెర్మైన్ చిన్నప్ప, వేముల మండల పరిశీలకుడు వేల్పుల రాము, కౌన్సిలర్లు కోడి రమణ, వరప్రసాద్, హఫీజ్, చెన్నారెడ్డి, రామనాథ్, రామకృష్ణారెడ్డి, కోళ్ల భాస్కర్, నాగరాజు, కొమ్మా శివప్రసాద్‌రెడ్డి, రసూల్ పాల్గొన్నారు.

కార్యకర్తలు, నాయకులతో మమేకం పులివెందులకు వచ్చిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ను ఆయన స్వగృహం వద్ద పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి మమేకమయ్యారు. అనంతరం డీసీసీబీ చెర్మైన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డితోపాటు మరికొం దరు డెరైక్టర్లతో చర్చించారు.

Advertisement
Advertisement