మనసా స్మరామి

4 Jul, 2013 04:57 IST|Sakshi
మనసా స్మరామి
పల్లవి :
 
 ఆమె: ఉలికిపడకు కుకుకుకు
   పెదవి కలిపేందుకు కుకుకుకు
 అతడు: కలలు కనకు కుకుకుకు
   కథలు నడిపేందుకు కుకుకు
 ఆ: చిలక పలికిన వయసుకు
 అ: వయసు తొడిగిన సొగసుకు
 ఆ: స్వరాలు పెంచకు... అ: కుకుకుకుకు
 
 చరణం : 1
 
 ఆ: మొగ్గ విచ్చే వేళ నా మోజులన్నీ 
   పోటు తుమ్మెదల్లే తేనె విందుకొస్తావా
 అ: సిగ్గ్గులొచ్చే వేళ నే దగ్గరైతే పాలబుగ్గలోనే 
   ఎర్రపొంగులిస్తావా
 ఆ: మత్తుగ మల్లెలు అత్తరు చిందేవేళ 
   చంపకమాలలు సొంపులకిస్తావా
 అ: పైటల చాటుల పద్యము రాసేవేళ 
   ఉత్పలమాలలకూపిరి పోస్తావా
 ఆ: నీవడిగే దోపిడిలో... అ: నీ ఒడిలో ఒత్తిడిలో
 ఆ: వసంతవేళకు...
 
 చరణం : 2
 
 అ: ఆడదయ్యే వేళ నీ అందమంతా 
   ఎండ కన్నుదాటి గుండెలోకి వస్తావా
 ఆ: పాయసాలు పొంగే నీ పక్కకొస్తే 
   ముద్దు బారసాల ముందుగానే చేస్తావా
 అ: నన్నయభట్టుకు నవలలు నచ్చేవేళ 
   కౌగిలి పర్వం కొత్తగ రాస్తావా
 ఆ: చక్కిలిగింతలు తిక్కనకొచ్చినవేళ
   నర్తనశాలకు నాతో వస్తావా
 అ: నా ఎదలో పూపొదలో... ఆ: నా కథలో నీ జతలో
 అ: సందేహమెందుకు కుకు కుకు
 
**********
 
 పల్లవి :
 
 ఆమె: కోకిలమ్మ కొత్తపాట పాడింది
   కూనలమ్మ కూచిపూడి ఆడింది
 సందెపొద్దు నీడ అందగత్తె కాడ
   సన్నజాజి ఈల వేయగా
 అరె మావా ఇల్లలికి పండుగ చేసుకుందామా
 అతడు: ఓసి భామా బుగ్గలతో 
   బూరెలు వండుకుందామా ॥మావా॥
 ఆ: పక్కపాపిడెందుకో... 
  అ: పైట దోపిడెందుకే
 ఆ: మగడా ఎడాపెడా గడీ పడగానే ॥మావా॥
 
 చరణం : 1
 
 ఆ: పూలచెట్టు గోలపెట్టు తేనెపట్టులో నీ గుట్టు తీపిగున్నది
 అ: పైటగుట్టు బైటపెట్టు చేతిపట్టులో నీ కట్టు జారుతున్నది
 ఆ: కొత్తగుట్టు కొల్లగుట్టు కోకోనట్టులో 
   రాబట్టు కొబ్బరున్నది
 అ: దాచిపెట్టి దోచిపెట్టు చాకులెట్టులో 
   బొబ్బట్టు మోతగుందది
 ఆ: బుగ్గలో మొగ్గలే నువ్వు దగ్గరైతే విచ్చుకుంటానయ్యో
 అ: నచ్చినా గిచ్చినా నువ్వు ఇచ్చుకుంటే
   పుచ్చుకుంటానమ్మో
 ఆ: వరసే నిలు కలు కొలు అనగానే ॥మావా॥
 
 చరణం : 2
 
 అ: కన్నుగొట్టి రెచ్చగొట్టు కాకపట్టులో
   కాల్‌షీటు నైటుకున్నది
 ఆ: పాలుపట్ట్టి పండబెట్టు పానిపట్టులో
   బెడ్‌షీటు బెంగపడ్డది
 అ: బెడ్డులైటు తీసికట్టు గుడ్డునైటులో
   కుర్ర ఈడు కుంపటైనది
 ఆ: ఉట్టికొట్టి కత్తిపట్టు జాకుపాటులో
   ఆటుపోటు అక్కడున్నది
 అ: ఒంపులో సొంపులో నిన్ను బొత్తుకుంటే
   మొత్తుకుంటావమ్మో
 ఆ: చెప్పినా చేసినా నీది కాని నాది ఎక్కడుంటావయ్యో
 అ: హజలే చెలి అనార్కలి అనగానే... ॥మావా॥
 
 చిత్రం : సుందరకాండ (1992), రచన : వేటూరి
 సంగీతం : ఎం.ఎం.కీరవాణి, గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర
 
 - నిర్వహణ: నాగేష్
 
మరిన్ని వార్తలు