బాబు, రాజన్నపాలనలో... పక్కా ఇళ్లు

4 May, 2014 01:32 IST|Sakshi
బాబు, రాజన్నపాలనలో... పక్కా ఇళ్లు

బాబు పాలన

  తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం దక్కినా కనీసం మూడో వంతు కుటుంబాలకు కూడా ఇళ్లను నిర్మించి  ఇవ్వలేకపోయారు చంద్రబాబు.ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మితమైన ఇళ్లు 20 లక్షల లోపే.నియోజకవర్గానికి ఏడాదికి వేయి ఇళ్లు చొప్పున నిర్మిస్తున్నట్టు అప్పట్లో చెప్పిన ఆయన, వాటి నిర్మాణంలో ఎమ్మెల్యేల పెత్తనాన్ని పెంచారు. వారు చెప్పినవారికే ఇళ్లు కేటాయించే పద్ధతిని కొనసాగించి, వాటిలో అనర్హులు పాగా వేసేలా చేశారు.జన్మభూమి పేరుతో అట్టహాసంగా నిర్వహించిన కార్యకమాల్లో... ఇళ్లు కావాలంటూ పేదలు లక్షల సంఖ్యలో అందజేసిన విజ్ఞాపనలను బుట్టదాఖలు చేశారు. ‘వాంబే’ పేర కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లనే తన ఘనతగా చెప్పుకొంటూ కాలం వెళ్లదీశారు.
 
 రాజన్న రాజ్యం

   పేదలందరికీ సొంత గూడు ఉండాలన్న ఆలోచన కొత్తది కానప్పటికీ, సొంతిల్లు లేని కుటుంబం ఒక్కటి కూడా రాష్ట్రంలో ఉండరాదనే సంకల్పంతో ఆ బృహత్ ప్రణాళికను పూర్తి చేయటం ప్రారంభించింది మాత్రం వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే.  ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో చేపట్టిన పాదయాత్రలో పేదల కష్టాలను కళ్లారా చూసి... వాటిని దూరం చేయాలన్న తపనతో వారికి ఏం చేస్తే బాగుంటుందన్న కోణంలో అప్పుడే ప్రారంభమైన ఆలోచనలో పుట్టుకొచ్చిందే... ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలన్న తపన. 2004లో అధికారంలోకి వచ్చిన కొత్తలో అంతకుముందు కొనసాగిన ఇళ్ల నిర్మాణ పథకాన్ని మామూలుగానే కొనసాగించారు. అంతకుముందు మంజూరై నత్తనడక నడుస్తున్న కొన్ని ఇళ్లు కలుపుకొని మొత్తం నాలుగు లక్షల ఇళ్లను పూర్తి చేశారు.

విప్లవాత్మక మార్పులు తెస్తేగాని పేదలందరికీ సొంత గూడు లభించదన్న ఉద్దేశంతో ‘ఇందిరమ్మ’ పథకానికి శ్రీకారం చుట్టారు. కేవలం మూడేళ్ల కాలంలో వీలైనంతమంది పేదలకు ఇంటి వసతి కల్పించాలన్న లక్ష్యంతో ఓ యజ్ఞంలా దాన్ని ప్రారంభించి కొనసాగించారు.
  2006-07, ఇందిరమ్మ మొదటి దశ: కనీవినీ ఎరుగని రీతిలో కేవలం ఒక్క ఏడాదిలోనే 20,22,801  ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు.దేశం మొత్తం రాష్ట్రం వైపు చూడసాగింది. ఇంతటి భారీ సంఖ్యలో ఇళ్లను ప్రారంభించి, పూర్తి చేయటం సాధ్యమా అని ముఖ్యమంత్రులంతా విస్తుపోయారు. కానీ రాజశేఖరరెడ్డి దాన్ని చేసి చూపారు.2007-08, ఇందిరమ్మ రెండో దశ: అంతకుముందు సంవత్సరం రికార్డును బద్దలు కొడుతూ 20,95,110  ఇళ్లను ప్రారంభించారు.2008-09, ఇందిరమ్మ మూడో దశ:  15,44,889 ఇళ్ల నిర్మాణం మొదలైంది. ఇలా ఈ మూడేళ్ల కాలంలో సింహభాగం పేదలకు ఇళ్లు అందాయి.
 
వైఎస్సార్ బతికున్నపుడు దేశం మొత్తం మీద 47 లక్షల ఇళ్లు  కడితే.. ఆయన హయాంలోనే ఒక్క రాష్ట్రంలోనే 48 లక్షలు ఇళ్లు కట్టారు.మరోసారి ప్రజల్లోకి వెళ్లి ఇంకా పేదల ఇంటి పరిస్థితిని కళ్లారా చూసి, వారి నోటివెంటే వారి పరిస్థితిని తెలుసుకోవాలనుకున్నారు. ఈలోపు ఎన్నికలు ముంచుకొచ్చాయి. పేదల వెన్నంటి ఉన్నందున రాజశేఖరరెడ్డిని ప్రజలు మళ్లీ ఆశీర్వదించారు. ప్రజల్లోకి వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకోవాలన్న ఆకాంక్షతో ‘రచ్చబండ’ కార్యక్రమం చేపట్టారు... ఆ కార్యక్రమానికి వెళ్లే క్రమంలోనే ఆయన హెలీకాప్టర్ ప్రమాదంలో మనందరికీ దూరమయ్యారు.
 
జగన్ సంకల్పం
 
 ‘‘సొంత గూడు లేక లక్షల మంది దుర్భర జీవితం గడుపుతున్నారు. వారందరికీ యోగ్యమైన సొంతింటి అవసరముంది. వారి కలను నిజం చేసి చూపిస్తా. 2019 నాటికి ‘మాకు సొంతిల్లు లేదు’ అని ఎవరూ చెయ్యెత్తి చూపే పరిస్థితి లేకుండా చేస్తా. ఏటా 10 లక్షల చొప్పున ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మిస్తా. ఇల్లు ఇచ్చినప్పుడే ఆడపడుచు పేరున పట్టా ఇస్తా. ఇంటిని రుణంలో కాదు.. ఇంటి మీదే రుణం తెచ్చుకునేలా చేస్తా. ఇంటిపై పావలా వడ్డీకే రుణాలు తీసుకునే అవకాశం కల్పిస్తా. ఉండడానికి నీడనిస్తా... ఇంటి పత్రాలను చేతికిస్తా... ఆపదలో అవసరమైతే పావలావడ్డీకి రుణం తెచ్చుకునే వెసులుబాటు ఇచ్చి ఆదుకుంటా! దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పేదలకు సొంత గూడు కల్పించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పనితీరు స్ఫూర్తిగా దీన్ని సాధ్యం చేసి చూపుతా...’’

మరిన్ని వార్తలు