సిల్‌హౌటీ ఎవరంటే...

28 May, 2017 01:20 IST|Sakshi

ఔట్‌లైన్‌ డ్రాయింగ్‌ను సిల్‌హౌటీ అంటారనే విషయం మనకు తెలుసు. నిజానికి ఇదో వ్యక్తి పేరు. ఫ్రెంచ్‌ ఆర్థిక మంత్రి ఎటిఎన్నె దె సిల్‌హౌటీ, పొదుపు సూత్రాల గురించి ఎక్కువగా మాట్లాడేవాడు. యుద్ధపరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 1759లో రకరకాల ఆర్థిక సంస్కరణలు చేపట్టాడు. వృథా ఖర్చు, ఆడంబరాలు తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు.

సంపన్నుల ఇంట్లో ఉండే పెయింటింగ్స్, కలర్‌ పోర్టరైట్‌లపై కూడా పన్నులు విధించడంతో, వారు ప్రత్యామ్నాయాలు వెదుక్కోవడం మొదలుపెట్టారు.  పర్సనల్‌ అపిరియన్స్‌ను రికార్డ్‌ చేయడానికి బ్లాక్‌కార్డ్‌ నుంచి కట్‌ చేసి తయారుచేసే ‘ఔట్‌లైన్‌ పోర్టరైట్‌’లు ఆ సమయంలో అందరినీ ఆకర్షించాయి. వీటికి చాలా తక్కువ ధర.  ఇవి ఇంట్లో ఉంటే పన్ను కట్టాల్సిన పని కూడా లేకపోవడంతో బ్లాక్‌ కలర్‌ ఔట్‌లైన్‌ పోర్టరైట్‌లపై ప్రజలు మొగ్గు చూపడం మొదలైంది. ఏ వ్యక్తి వల్ల అయితే ప్రజలు  ఔట్‌లైన్‌ పోర్టరైట్‌లపై మొగ్గు చూపారో...ఆ వ్యక్తి పేరు మీదే వీటిని పిలవడం మొదలైంది!
 

మరిన్ని వార్తలు