పంచామృతం: ఇష్టమైన పుస్తకం

23 Mar, 2014 02:00 IST|Sakshi

 పుస్తకం అంటే జేబులో పట్టేసే పూదోట... తెలియని లోకాలకు ఎగరేసుకుపోయే మాయాతివాచీ...  జీవితంలోని వెలుగు నీడల్లో సుఖదుఃఖాల్లో, ఏకాంతంలో, నిశ్శబ్దంలో మనల్ని అక్కున చేర్చుకొని ఓదార్చి, స్ఫూర్తిని పంచేదే పుస్తకం. అలాంటి పుస్తకాల్లో కొన్ని మనసుకు మరింతగా హత్తుకుపోయేవి ఉంటాయి. అమితంగా అలరించే ఆ పుస్తకాలను కలకాలం  దాచుకోవాలనిపిస్తుంది. ఫేవరెట్ పుస్తకమని  చెప్పాలనిపిస్తుంది. ఈ విషయాన్ని కొందరు చదువరులైన సెలబ్రిటీల వద్ద  ప్రస్తావిస్తే... వారు తమకు బాగా ఇష్టమైన పుస్తకం గురించి ఇలా చెప్పారు...

లిలియన్ వాట్సన్ రాసిన ‘లైట్ ఫ్రమ్ మెనీ లాంప్స్’ స్ఫూర్తిని పంచే ఖజానా లాంటి పుస్తకం. స్టీఫెన్ ఆర్ కోవే, డేవిడ్ కే హ్యాచ్‌లు రాసిన ‘ఎవ్రీడే గ్రేట్‌నెస్’ కూడా నాకు బాగా ఇష్టమైన పుస్తకం.
 - అబ్దుల్‌కలాం
 
 అమెరికాలో పుట్టి పెరిగిన ఒక ఆఫ్రోఅమెరికన్ కథ అయిన ‘సాంగ్ ఆఫ్ సోలోమన్’ నాకు బాగా ఇష్టమైన పుస్తకం. టోనీమోరిసన్ రచించిన ఈ పుస్తకానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆ స్థాయికి తగిన నవల ఇది.
 - బరాక్ ఒబామా
 
 ఆండ్రూ అగస్సీ ఆటోబయోగ్రఫీ ‘ఓపెన్’ అంటే నాకు చాలా ఇష్టం. అగస్సీ కూడా అందరిలాంటి మనిషే.. అయితే ఆయన ఒక ఛాంపియన్‌గా ఎదిగిన తీరు, ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు వాటిని ఆయన అధిగమించిన తీరు చాలా స్ఫూర్తిమంతంగా ఉంటుంది.
 - విరాట్ కొహ్లి
 
 నా బ్యాగులో ఎప్పుడు వెదికినా ఏదో ఒక నవల ఉంటుంది. శరత్‌చంద్ర, రవీంద్రనాథ్ ఠాగూర్‌ల పుస్తకాలు బాగా ఇష్టం. అరుంధతిరాయ్ రచించిన ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’
 బాగా ఇష్టమైన పుస్తకం.
 - శ్రీయ
 
 మనిషిలో భావోద్వేగాలను అధ్యయనం చేసి లోతైన విశ్లేషణలా ఎమిలీజోలా రాసిన ‘థెరేసే రాకిన్’ నాకు బాగా ఇష్టమైన నవల.
 - కేట్ విన్‌స్లెట్

మరిన్ని వార్తలు