ఒడుపు తెలిసిన పక్షి

4 Apr, 2015 22:45 IST|Sakshi
ఒడుపు తెలిసిన పక్షి

ప్రధానంగా ఉత్తరమెరికా, దక్షిణ మెరికా, ఐరోపా ఖండాల్లో కనిపించే పక్షి ఒస్ప్రీ. డేగ జాతికి చెందిన దీనికి ప్రధానంగా చేపలే ఆహారం. దాదాపు ముప్పై అడుగుల ఎత్తు నుంచే నీటిలో ఉన్న చేపలను గమనించగలడం ఈ పక్షి వీక్షణాసామర్థ్యానికి నిదర్శనం. వేగంగా వచ్చి నీటిలో పై వైపు ఈదుతున్న చేపలను తన కాళ్లతో పట్టేసుకొని ఒడ్డుకు చేరుకొంటుంది ఒస్ప్రీ. పట్టుకొన్న చేపను ముక్కుతో పొడిచి చంపిన తర్వాతే భుజిస్తుందిది. కొన్ని రకాల పక్షుల్లోనే ఇలాంటి లక్షణం ఉంటుంది. నదులు, సరస్సులు, చెరువుల తీరాల్లో ఉండే చెట్లపై నివసిస్తాయివి.
 
 చలితీవ్రత ఎక్కువగా ఉండి, నీళ్లు గడ్డకట్టుకుపోయే వాతావరణాలు ఈ పక్షులకు కష్టకాలం అవుతాయి. నీళ్లు గడ్డకట్టుకుపోతే అందులో చేపలు చనిపోతాయి.. మంచుగడ్డల మధ్యన ఇరుక్కొన్న చేపలు ఈ పక్షులకు దొరికే అవకాశం ఉండదు. దీంతో అలాంటి వాతావరణ పరిస్థితుల నుంచి వలస వెళ్లకతప్పదు. గుడ్లను ఆడపక్షి పెట్టినా.. పొదగడం మాత్రం దాని జతలోని పక్షి బాధ్యత కూడా! ఈ పక్షి స్ఫూర్తితో కొన్ని రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లకు కూడా దీనిపేరే పెట్టారు.

మరిన్ని వార్తలు