సవతిపోరుతో సెకండ్ ఇన్నింగ్స్!

20 Jul, 2014 01:53 IST|Sakshi
సవతిపోరుతో సెకండ్ ఇన్నింగ్స్!

టీవీక్షణం: ఒకనాడు వెండితెరపై గ్లామరస్ తారలుగా వెలుగొందిన ఇద్దరు నటీమణులు... ఇప్పుడు బుల్లితెరపై సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. సవతులుగా సూపర్‌‌బగా నటిస్తూ సీరియల్‌కి టీఆర్పీని బాగానే తెచ్చిపెడుతున్నారు. సోనీ చానెల్లో ప్రసారమయ్యే ‘ఏక్ నయీ పెహచాన్’లో పూనమ్ థిల్లాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సీరియల్‌లో మరో సీనియర్ నటి ఎంటరయ్యింది. ఆమే... పద్మినీ కొల్హాపురి. ఒకప్పుడు తమ గ్లామర్‌తో యువత హృదయాలను కొల్లగొట్టిన ఈ ఇద్దరూ, ఇప్పుడు తమ పెర్‌ఫార్మెన్స్‌తో ఇల్లాళ్ల మనసులు దోచేస్తున్నారు.
 
  పూనమ్ భర్త సురేష్... పద్మినిని రెండో పెళ్లి చేసుకుంటాడు. చాన్నాళ్ల తర్వాత ఆ విషయం ఇద్దరికీ తెలుస్తుంది. పూనమ్ త్యాగం చేసి తప్పుకుంటే, పద్మిని మాత్రం భర్తని అడ్డు పెట్టుకుని పూనమ్‌ని సాధిస్తూ ఉంటుంది. ఈ సవతుల పోరు సీరియల్‌ని సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తోంది. ‘ప్రేమ్‌రోగ్’ లాంటి చిత్రాల్లో సాత్వికంగా కనిపించి మురిపించిన పద్మిని, ఓ నెగిటివ్ రోల్‌తో తిరిగి రావడాన్ని ప్రేక్షకులు ఇష్టంగా స్వాగతించారు. పద్మిని కూడా తన పాత్రకు నూరుశాతం న్యాయం చేస్తోంది!

మరిన్ని వార్తలు