వారఫలాలు : 13 ఆగస్టు నుంచి 19 ఆగస్టు 2017 వరకు

13 Aug, 2017 04:37 IST|Sakshi
వారఫలాలు : 13 ఆగస్టు నుంచి 19 ఆగస్టు 2017 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
 ఎంతోకాలంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బాధ్యతల నుంచి విముక్తి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వపరంగా సాయం అందుతుంది. వారం మధ్యలో వివాదాలు. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
మీ ఊహలు, అంచనాలు నిజం చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట లభిస్తుంది. వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పైస్థాయి అధికారుల నుంచి ప్రశంసలు. కళాకారులకు అవార్డులు రావచ్చు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. నీలం, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆశించిన రీతిలో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులతో కూడిన బదిలీలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం మ«ధ్యలో కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఉత్సాహంగా ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. దూరమైన ఆప్తులు దగ్గరకు చేరతారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. కళాకారులకు సత్కారాలు. వారం చివరిలో అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఎటువంటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. ఎరుపు, లేత గులాబీ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ప్రారంభంలో వివాదాలు, సమస్యలు ఏర్పడినా క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనయోగం. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. నేరేడు, నీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. రియల్‌ఎస్టేట్‌ వారికి లాభదాయకంగా ఉంటుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పోటీపరీక్షల్లో విజయం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, లేత నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఇంటాబయటా మీకు ఎదురుండదు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరుల మెప్పు పొందుతారు. కొన్ని నిర్ణయాలకు కుటుంబసభ్యుల ప్రశంసలు అందుతాయి. వస్తు, వాహన లాభాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం. కళాకారులకు పురస్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పరపతి కలిగిన వారితో పరిచయాలు. ఆసక్తికర సమాచారం అందుతుంది. పనుల్లో విజయం. కుటుంబసమస్యలు తీరి ఊరట లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. భూవివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. గులాబీ, లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొనే అవకాశం. పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు కాస్త తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం ఉన్నా గుర్తింపు రాగలదు. కళాకారులకు శుభవార్తలు. వారం చివరలో విందువినోదాలు. వస్తులాభాలు. నీలం, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
రాబడితో సమానంగా ఖర్చులు. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తి వివాదాలు కొంతవరకూ తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు, నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు కలసిరావు. పనుల్లో ఆటంకాలు. ఇంటాబయటా ఒత్తిడులు ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగడం మంచిది. ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. ధనలాభం. గులాబీ, లేత ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

మరిన్ని వార్తలు