వారఫలాలు : 10 జూలై నుంచి 16జూలై, 2016 వరకు

10 Jul, 2016 02:00 IST|Sakshi
వారఫలాలు : 10 జూలై నుంచి 16జూలై, 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, ఆప్తులు చేదోడుగా నిలుస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఒక ముఖ్యసమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. లేత పసుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం.  ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆస్తి విషయంలో బంధువులతో ఒప్పందాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు పదవులపై కొత్త ఆశలు. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు కొంత మందగిస్తాయి. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. కళాకారుల యత్నాలు నిరాశ పరుస్తాయి. ఆకుపచ్చ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న కార్యక్రమాలలో అవరోధాలు. బంధువులు, మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆస్తుల విషయంలో వివాదాలు నెలకొంటాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగులకు  ఒత్తిడులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. పసుపు, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతస్తోత్రాలు పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
శ్రమాధిక్యంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి కాగలవు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. సోదరులు, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడులు. వాహన, గృహం కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు. గులాబి, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు అనుకూల సమాచారం. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు. కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి. ఆకుపచ్చ, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యభంగం. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం తప్పదు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. లేతనీలం, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్న పనులు సాఫీగా పూర్తి కాగలవు. రాబడి కొంత పెరిగే అవకాశం. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆరోగ్యం కుదుటపడి ఉపశమనం పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రోత్సాహం. కళాకారులకు సన్మానాలు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాస్తోత్రాలు పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. సోదరుల నుంచి ధనలాభ సూచనలు. ఇళ్లు, వాహనాల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. నేరేడు, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబపరంగా కొన్ని ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. భూ, వాహనయోగాలు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. నలుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని విషయాలలో రాజీపడక తప్పదు. ఒప్పందాలు కొన్ని వాయిదా వేస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. కళాకారులకు ఒత్తిడులు. లేతనీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులు, సోదరీలతో అకారణంగా వివాదాలు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తప్పకపోవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు విధుల్లో కొద్దిపాటి మార్పులు. రాజకీయవర్గాలకు కొంత గందరగోళంగా ఉంటుంది. గులాబి, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

మరిన్ని వార్తలు