అలవాటు పడితే చక్కెర కూడా..

13 Apr, 2016 15:27 IST|Sakshi
చక్కెర తినడానికి అలవాటు పడిన వాళ్లని మత్తు పదార్థాలకు బానిసలైన వారి కింద లెక్కవేయాలని అంటోంది తాజా అధ్యాయనం. నికోటిన్ వ్యసనానికి అలవాటు పడిన మనుషులకు ఇచ్చే మందులను చక్కెరకు బానిసలైన జంతువులకు అందించొచ్చని ఈ పరిశోధనలో వెల్లడైంది. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలోని 1.6 బిలియన్ జనాభాలో 600 మిలియన్ల మంది ఒబెసిటీతో బాధపడుతున్నారని తేల్చింది. ఇందులో అధికశాతం ప్రజలు చక్కెర పాళ్లు ఎక్కువగా తీసుకున్నవారే కావడం గమనార్హం. పొగాకు, కొకైన్, మార్ఫైన్తో సమానంగా చక్కెరకూ అడిక్టివ్ సామర్ధ్యం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. బరువు పెరగడంతో పాటు చక్కెర పాళ్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటున్న జంతువులు న్యూరొలాజికల్, మనో వ్యాధులకు గురవుతాయని తెలిపారు. 
 
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) ఆమోదించిన వారెన్క్లియన్, చంపిక్స్ మందులు చక్కెర అడిక్షన్ను ట్రీట్ చేయడానికి ఉపయోగపడతాయని తమ పరిశోధనలో తేలిందని పరిశోధకులు వివరించారు. సహజంగా తయారయ్యే చక్కెరే కాకుండా కృత్రిమంగా తయారుచేసే చక్కెర వల్ల కూడా ఈ ప్రభావం ఉంటుందన్నారు. వీటికి సంబంధించిన వివరాలను ప్లొస్ వన్ జర్నల్లో ప్రచురించారు.
>
మరిన్ని వార్తలు