మంటలు చెలరేగి కారు ఇంజన్‌ దగ్ధం

13 Jan, 2017 14:18 IST|Sakshi

హైదరాబాద్‌: కుషాయిగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీలో పనిచేసే ఓ ఉద్యోగి కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నార్త్‌ గేట్‌ పార్కింగ్‌ ప్రదేశంలో ఉన్న కారులో నేటి ఉదయం అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. ఇది గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. కారు ఇంజన్‌ పూర్తిగా దగ్ధమైంది. అయితే ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

మరిన్ని వార్తలు