ఓయూతో ఆయనది విడదీయరాని అనుబంధం

28 Jul, 2015 06:30 IST|Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఉస్మానియా విశ్వవిద్యాలయంతో ఎంతో అనుబంధం ఉంది. కలామ్ సైంటిస్టుగా ఉన్నడు క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ కళాశాల ఎదుట ఆర్‌అండ్‌టీ యూనిట్ ఫర్ నావిగేషనల్ ఎలక్ట్రానిక్స్ స్థాపించి తొలి డెరైక్టర్‌గా పనిచేశారు. ఈ సంస్థ ద్వారా అనే పరిశోధనలు చేసి రక్షణ రంగానికి అందచేశారు. ఓయూను అనేక సార్లు సందర్శించిన కలాం రాష్ట్రపతి హోదాలో దివగంత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో కలసి క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉంది. ప్రస్తుత టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ (గతంలో ఓయూ విద్యార్థి) స్నాతకోత్సవంలో జై తెలంగాణ నిదాలు చేయగా.. ఓపిక పట్టాలని కలాం శాంతింప చేశారు.

గత ఏడాది ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల బయోమెడిసిన్ ఇంజినీరింగ్ విభాగంలో నానో, బయో, టెక్నో, కాగ్నో (ఎన్‌బీఐసీ) అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు కలాం హాజరయ్యారు. అదే రోజు ఓయూ రోడ్డులోని శ్రీ అరంబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యార్థులను ఉత్తేజపరిచేలా ప్రసంగించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు చెప్పారు. ఇప్పటికీ కళ్లలో మెదులుతున్న ఆ దృష్యాలు చెదరక ముందే ఆ గొప్ప దార్శనికుడు కన్నుమూయడం దేశానికి ఎంతో లోటని ఓయూ బయోమెడిసిన్ ఇంజినీరింగ్ అధ్యాపకుడు మేడిపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు