సమస్యల పరిష్కారంలో ఏపీ సర్కార్ విఫలం

27 Oct, 2015 19:32 IST|Sakshi

హైదరాబాద్: ఉద్యోగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ వైయస్‌ఆర్ టీచర్స్ ఫెడరేషన్(వైఎస్సార్‌టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కె. జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.ఓబుళపతిలు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2015 జనవరిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన కరవు భత్యం(డీఏ) ఇంత వరకు చెల్లించలేదని తెలిపారు. పదవ పీఆర్సీలో మిగిలిన జీవోలను కూడా జారీ చేయలేదన్నారు. చివరికీ ఉపాధ్యాయ బదిలీలలో పారదర్శకత, స్పష్టత లేదన్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం టీచర్లను గందరగోళ పరిస్థితులలోకి నెట్టిందన్నారు. ఇప్పటికైనా బదిలీ ద్రువీకరణ పత్రాలను వెంటనే ఇచ్చి వెబ్ కౌన్సిలింగ్‌కి తెరదించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు