మహారాజా అగ్రసేన్కు కేసీఆర్ నివాళి

25 Sep, 2014 11:53 IST|Sakshi

హైదరాబాద్ : మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో జరిగిన ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్, నాయిని నర్సింహారెడ్డి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు హాజరయ్యారు.  అగ్రసేన్ జీ చిత్ర పటానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు.

 

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 1969 ఉద్యమంలో అగర్వాల్స్ పాత్ర మరవలేనిదన్నారు. తెలంగాణలో వ్యాపారాలూ ప్రారంభించేవారికి సహకారం అందిస్తామని ఆయన అన్నారు. భవిష్యత్‌లో హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తుందని, అత్యున్నత పారిశ్రామిక పాలసీని అమలు చేస్తామన్నారు.

 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు