చీపురుపల్లిలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం: కామినేని

25 Sep, 2014 11:38 IST|Sakshi
చీపురుపల్లిలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం: కామినేని

విజయనగరం: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడతామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గురువారం విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా చీపురపల్లిలోని ఎక్స్రే యూనిట్ను ప్రారంభించారు.  అంతకుమందు విజయనగరంలోని గోషామహల్, జిల్లా కేంద్ర ఆస్పత్రులను పరిశీలించారు.

అలాగే జిల్లాలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీ స్థలాన్ని కూడా మంత్రి కామినేని శ్రీనివాస్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళినితోపాటు పలువురు ప్రజాప్రనిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు