'హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరపాలి'

18 Jan, 2016 15:32 IST|Sakshi
'హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరపాలి'

హైదరాబాద్‌: హెచ్‌సీయూలో దళిత పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై ప్రజాసంఘాల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రోహిత్‌ ఆత్మహత్యపై దర్యాప్తు జరుపాలని వారు డిమాండ్ చేశారు. హెచ్‌సీయూలో ఇప్పటివరకు జరిగిన దళిత విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు వేముల రోహిత్ ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. దళిత విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన వర్సిటీ వీసీపై చర్య తీసుకోవాలని కోరారు. అదేవిధంగా హెచ్‌యూసీలో విద్యార్థులపై విధించిన బహిష్కరణ చర్యలను వెంటనే వెనుకకు తీసుకోవాలన్నారు. వర్సిటీలో సాంఘిక బహిష్కారం వంటి చర్యలు సరికావని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.
 

మరిన్ని వార్తలు