గ్రేటర్లో 5 కొత్త మున్సిపాలిటీలు

12 Apr, 2016 03:23 IST|Sakshi
గ్రేటర్లో 5 కొత్త మున్సిపాలిటీలు

పురపాలికలుగా జల్‌పల్లి, జిల్లేలగూడ, మీర్‌పేట్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో ఐదు కొత్త మున్సిపాలిటీలు ఆవిర్భవించాయి. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్, ఘట్‌కేసర్ మండలాల పరిధిలోని 11 గ్రామ పంచాయతీలు విలీన ప్రక్రియ ద్వారా ఐదు కొత్త మున్సిపాలిటీలుగా రూపుదిద్దుకున్నాయి. సరూర్‌నగర్ మండలంలోని జిల్లేలగూడ, మీర్‌పేట్ గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా లభించింది. ఇదే మండల పరిధిలోని మూడు గ్రామ పంచాయతీల విలీనంతో జల్‌పల్లి మున్సిపాలిటీ ఏర్పాటైంది. ఘట్‌కేసర్ మండల పరిధిలో నాలుగు గ్రామ పంచాయతీల విలీనంతో బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి.

ఈ 11 గ్రామ పంచాయతీల హోదాను రద్దు (డీనోటిఫై) చేసినట్లు ప్రకటిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేయగా వాటి విలీనంతో ఐదు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటిస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆ వెంటనే మరో ఉత్తర్వు జారీ చేసింది. కొత్తపేట్, పహాడీ షరీఫ్ గ్రామ పంచాయతీలతోపాటు బాలాపూర్ గ్రామ పంచాయతీలోని సర్వే నం. 142, 253ల విలీనంతో జల్‌పల్లి మున్సిపాలిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

బోడుప్పల్, చెంగిచెర్ల గ్రామ పంచాయతీల విలీనంతో బోడుప్పల్ మున్సిపాలిటీ ఏర్పాటైంది. మీర్‌పేట్, జిల్లేలగూడ గ్రామ పంచాయతీల స్థాయిని పెంచి మున్సిపాలిటీ హోదా కల్పించింది. మేడిపల్లి, పర్వతపూర్ గ్రామ పంచాయతీల విలీనంతో ఫిర్జాదిగూడ మున్సిపాలిటీగా అవతరించింది. మున్సిపల్ ఎన్నికల నిబంధనల మేరకు కొత్త మున్సిపాలిటీలు ఏర్పడిన నాటి నుంచి రెండేళ్లలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీతో కలిపి మొత్తం 68 నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీలు ఉండగా తాజాగా ఐదు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో ఈ సంఖ్య 73కు పెరిగింది.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫలక్‌నామా ప్యాలెస్‌లో క్యాథరిన్‌ హడ్డాకు వీడ్కోలు

మెట్రో రైలుకు తప్పిన ప్రమాదం,ఖండించిన మెట్రో రైల్‌ ఎండీ

బ్లెస్సీ.. ఎక్కడున్నావ్‌?

సిజ్జూకు ఆపరేషన్‌

అక్రమాస్తుల కేసు: సాన సతీష్‌ అరెస్ట్‌

నోటు పడితేనే..

జలయజ్ఞం

నగరంలో పెరుగుతున్న ‘శునక బాధితులు’

వాల్మీకి టైటిల్‌ను మార్చాలి : ఆర్‌.కృష్ణయ్య

రా‘బంధువు’!

గర్దాస్‌ రమేష్‌పై పీడీ యాక్ట్‌

భగ్గుమంటున్న బియ్యం

కొలిక్కి రాని కిడ్నాప్‌ కేసు..

నిత్య పెళ్లి కొడుకు అరెస్టు

మెన్స్‌పార్లర్‌లో గొడవ

ఇంటింటికీ కాంగ్రెస్‌

ఎక్కడి నుంచైనా సరుకులు

వారఫలాలు (జులై 27 నుంచి ఆగస్ట్‌ 2 వరకు)

గ్రహం అనుగ్రహం (27-07-2019)

విధులు మరచి టిక్‌టాక్‌

సామాన్యుల నుంచే ‘టోల్‌’ తీస్తున్నారు! 

తుప్పుకిక ఓటమి తప్పదు... 

ఆరోగ్యశ్రీ నుంచి 50 వ్యాధులు ఔట్‌! 

తెలంగాణలోనే అమిత్‌ షాకు సభ్యత్వం 

ప్రతిభకు సాయం.. పేదలకు ఊతం

రాష్ట్రంలో పెద్ద పులులెన్ని?

ముహూర్తం.. శ్రావణం!

ఫాం కోల్పోయిన మిలటరీ డెయిరీ

పట్టణాలపై పూర్తి ఆధిపత్యం!

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ నుంచైనా రేషన్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇది ‘మహర్షి’ కలిపిన బంధం

ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్‌!

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!

హీరోయినా..? ఐటమ్‌ గర్లా?

‘మనం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

చౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు