పరిశ్రమల ఏర్పాటుపై ఉచిత కౌన్సెలింగ్

10 Jun, 2015 18:38 IST|Sakshi

సనత్‌నగర్ (హైదరాబాద్): ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు భారతీయ యువశక్తి ట్రస్ట్ (బీవైఎస్‌టీ) ఆధ్వర్యంలో బేగంపేట్ మోతీలాల్ నెహ్రునగర్‌లోని సంస్థ కార్యాలయంలో గురువారం ఉచిత కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఈ కౌన్సెలింగ్ కొనసాగుతుంది. పరిశ్రమ నెలకొల్పడానికి కావలసిన వనరులు ఏమిటి ? రుణం పొందడమెలా ? మార్కెటింగ్ మెళకువలు తదితర అంశాల గురించి తెలియజేయనున్నారు. వివరాలకు ఫోన్: 040-2776 5774 నెంబర్‌లో సంప్రదించవచ్చు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు