ఫ్రెషర్సా... ఎక్స్‌పీరియన్స్‌ ఎంత?

14 Feb, 2018 03:34 IST|Sakshi

సిటీలో కొత్తవాళ్లకు తగ్గిన ఐటీ కొలువులు

మూడు, నాలుగేళ్ల అనుభవం ఉన్నవాళ్లకే ఆఫర్స్‌.. ఏడాదిగా ఇదే ట్రెండ్‌

మెట్రో నగరాలతో పోలిస్తే ఐదో స్థానంలో హైదరాబాద్‌

గ్రేటర్‌లో ఫ్రెషర్స్‌కు కొలువుల్లో వృద్ధి 4 శాతమే

సాక్షి, హైదరాబాద్‌ :  ఐటీ.. బీపీవో(బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌).. కేపీవో(నాలెడ్జ్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌) రంగాలకు గత కొన్నేళ్లుగా కొంగుబంగారంగా మారింది హైదరాబాద్‌ మహానగరం. అయితే ఇప్పుడు హైటెక్‌ సిటీలో పరిస్థితి మారిందట. ఏడాదిగా ఇంజనీరింగ్‌ పట్టభద్రులకు ఐటీ కొలువుల్లో ఓపెనింగ్స్‌ అంతంత మాత్రంగానే ఉన్నాయని తాజా సర్వేలో వెల్లడయ్యింది. ఇక ఐటీ కొలువుల్లో వృద్ధి పరంగా చూసినా గ్రేటర్‌ హైదరాబాద్‌ ఐదో స్థానానికే పరిమితమైంది.

ఐటీ కొలువుల్లో వృద్ధి పరంగా ఫ్రెషర్స్‌కు 40 శాతం కొలువుల బూమ్‌తో కోల్‌కతా నంబర్‌వన్‌ స్థానంలో నిలిచినట్లు ప్రముఖ వెబ్‌సైట్‌ నౌక్రీ.కామ్‌ తాజా సర్వేలో వెల్లడయ్యింది. రెండో స్థానంలో నిలిచిన చెన్నైలో 15 శాతం.. మూడో స్థానం దక్కించుకున్న ఢిల్లీలో ఏడు శాతం.. నాలుగో స్థానంలో ఉన్న బెంగళూరులో ఐదు శాతం.. ఐదో స్థానంలో ఉన్న హైదరాబాద్‌లో 4 శాతం ఐటీ కొలువుల్లో వృద్ధి నమోదైనట్టు ఈ సర్వే పేర్కొంది. 2016 నుంచి 2017 డిసెంబర్‌ వరకూ వివిధ మెట్రో నగరాల్లో ఫ్రెషర్స్‌కు ఐటీ కొలువుల పెరుగుదలపై ఈ సర్వే చేసింది.

కొలువుల్లో మందగమనం
బహుళ జాతి, దేశీయ దిగ్గజ సంస్థలకు చెందిన సుమారు 1,200 సాఫ్ట్‌వేర్‌ కంపెనీల బ్రాంచీలు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలా పాలు సాగిస్తున్నాయి. ఆయా కంపెనీల్లో సుమారు 6 లక్షల మంది ఉపాధి పొందుతు న్నారు. ఆయా కంపెనీల విస్తరణ ప్రణాళికలు ఏటా ఆశించిన మేరకు అమలు కాకపోవడం.. కొత్త ప్రాజెక్టులు చేజిక్కకపోవడం.. అంతర్జాతీ యంగా మార్కెట్‌ ఆశించిన స్థాయిలో లేకపో వడం తదితర కారణాలతో కొలువుల్లో మంద గమనం నమోదైనట్లు ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఏటా ఈ రంగంలో స్థూలంగా 2 శాతం వృద్ధి నమోదవుతున్నట్లు వెల్లడించా రు.

ఐటీ రంగంతో పోలిస్తే గ్రేటర్‌ పరిధిలో ఏడాదిగా ఆటోమొబైల్‌ రంగంలో 31 శాతం, బీమా(ఇన్సూరెన్స్‌)రంగంలో 21 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరిగినట్లు నౌక్రీ.కామ్‌ సర్వేలో తేలింది. కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో నిర్మించ తలపెట్టిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టు నాలు గేళ్లుగా సాకారం కాకపోవడం ఈ రంగం వృద్ధికి ప్రతిబంధకంగా మారిందని ఐటీ నిపు ణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం నూత నంగా ప్రవేశపెట్టిన ఐటీ, హార్డ్‌వేర్‌ పాలసీ, టీఎస్‌ఐపాస్‌తో ఐటీ రంగంతోపాటు పారిశ్రా మిక రంగాలు ఇప్పుడిప్పుడే పురోగమిస్తున్నా యని, త్వరలో ఆయా రంగాల్లో వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.

అనుభవానికే పెద్దపీట..
మహానగరం పరిధిలో సుమారు వందకుపైగా ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో పట్టభద్రులైన ఇంజ నీర్ల (ఫ్రెషర్స్‌) కంటే మూడేళ్లపాటు ఐటీ రంగంలో అనుభవం గడించిన నిపుణులైన వారికే కొలువుల ఆఫర్స్‌ వెల్లువెత్తు తున్నాయని ఈ సర్వేలో తేలింది. వీరికి వేతనాలు కూడా ఆశించిన మేర దక్కుతున్నట్లు వెల్లడైంది.

నగరానికి తరలివస్తున్న ప్రముఖ కంపెనీలు
గ్రేటర్‌ పరిధిలో గతేడాది 45 బహుళ జాతి, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కొలువయ్యాయి. లక్ష మందికి ఉపాధి లభించింది. నూతన ఐటీ, హార్డ్‌వేర్, యానిమేషన్‌ పాలసీ, టీఎస్‌ఐపాస్‌ రాకతో ఆయా రంగాల ప్రముఖ కంపెనీలు నగరానికి తరలివస్తున్నాయి. జాతీయ సగటుతో పోలిస్తే ఐటీ ఎగుమతుల వృద్ధి నగరంలోనే అధికం.    – జయేశ్‌ రంజన్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి

మందగమనం తాత్కాలికమే..
ఫ్రెషర్స్‌కు ఓపెనింగ్స్‌ విషయంలో మందగమనం తాత్కాలికమే. గ్రేటర్‌లో నూతన కంపెనీల కార్యకలా పాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. సమీప భవిష్య త్‌లో ఆయా కంపెనీల్లో ఫ్రెషర్స్‌కు బోలెడన్ని అవకాశాలు దక్కుతాయి. ఫ్రెషర్స్‌కు సాఫ్ట్‌ స్కిల్క్స్‌లో శిక్షణ ఇచ్చే విషయంలో ఇంజనీరింగ్‌ కళాశాలలు అవసరమైన చర్యలు తీసుకుంటే ఐటీ రంగం పురోగమిస్తుంది.
– రమేశ్‌ లోకనాథన్, హైసియా మాజీ అధ్యక్షుడు

కొన్నేళ్లుగా గ్రేటర్‌ ఐటీ ఎగుమతుల్లో పెరుగుదల (రూ.కోట్లలో)..
సంవత్సరం               ఎగుమతులు
2013–14                 57,258
2014–15                 65,235
2015–16                 75,070
2016–17                 85,470
2017–18(అంచనా)     95,500
2020కి (అంచనా)     1,20,000

మరిన్ని వార్తలు