బహురూప

28 Aug, 2014 00:03 IST|Sakshi
బహురూప

చిత్రకారుల చేతుల్లో గణపతి బహురూపాల్లో కనువిందు చేశాడు. వర్ణాలు మిళితం చేసి.. కుంచెను వుుంచి.. కాన్వాస్‌పై అందంగా ఆవిష్కరించారు. వినాయుక చవితి పండుగను వివిధ ఘట్టాలుగా చిత్రాల్లో మలచి మురిపించారు. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బాలభక్త రాజుతో పాటు మరికొందరు కళాకారుల అపు‘రూపాల’తో బుధవారం ఏర్పాటు చేసిన 108 గణేశా పెరుుంటింగ్ ఎగ్జిబిషన్ చూపరులను కన్ను తిప్పుకోనివ్వలేదు. అలాగే.. బేగంపేట్ పర్యాటక భవన్‌లోని రెయిన్‌బో ఆర్ట్ గ్యాలరీలో సిరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెరుుంటింగ్

ప్రారంభించిన ‘ది గణేశ’ చిత్ర ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ రెండు ప్రదర్శనలూ వచ్చే నెల 4 వరకు సందర్శించవచ్చు. వీటితోపాటు తెలంగాణ టూరిజమ్ పర్యాటక భవన్‌లోనే నిర్వహిస్తున్న ‘మైసూర్ హ్యాండీక్రాఫ్ట్స్’
 ఎగ్జిబిషన్‌లోనూ వివిధ గణపతి కళాఖండాలు అబ్బురపరుస్తున్నారుు.

 
 

మరిన్ని వార్తలు