29న గణేశ్ ఉత్సవ కమిటీ సమావేశం

27 Aug, 2016 01:03 IST|Sakshi
హైదరాబాద్: జంట నగరాల్లో గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 29న సచివాలయంలో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు సీ బ్లాక్ నాలుగో అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగే ఈ సమావేశానికి గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు జంట నగరాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు.

ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీతో పాటు పోలీసు అధికారులు ఇందులో పాల్గొంటారు. ఏర్పాట్లకు సంబంధించిన అధికారులందరూ హాజరు కావాలని అన్ని శాఖలకు సాధారణ పరిపాలన విభాగం అంతర్గత మెమో జారీ చేసింది. గత ఏడాది గణేశ్ ఉత్సవ కమిటీ సమావేశంలో సీట్ల కేటాయింపుపై అభ్యంతరాలు, అసంతృప్తి కారణంగా వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఈసారి సాధారణ పరిపాలనా విభాగం అధికారులు సమావేశానికి సంబంధించిన సీట్ల కేటాయింపు వివరాలను సైతం ముందుగానే సభ్యులకు అందజేయడం గమనార్హం. 
>
మరిన్ని వార్తలు