Ganesh Chaturthi Celebrations: సింగపూర్‌లో ఘనంగా వినాయక చవితి పూజలు.. లడ్డూ వేలం

21 Sep, 2023 13:41 IST|Sakshi

సింగపూర్‌లో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణనాథుని జయజయద్వానాల మధ్య భక్తి శ్రద్దలతో, ఎంతో అద్యాత్మిక శోభతో ఘనంగా జరిగింది. సుమారు వందమంది ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించబడి ముగ్ధమనోహరంగా తీర్చిదిద్దిన గణనాధుని ప్రధాన విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

పూజనంతరం వినాయకచవితి లడ్డు వేలం ఆసక్తికరంగా సాగింది. ఇందులో వీరగ్రూపు లడ్డును దక్కించుకుంది. ఈ సందర్భంగా సమాజ అధ్యక్షులు  బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి..పూజలో పాల్గొన్న పిల్లలందిరికి మట్టితో చేసిన గణపతి విగ్రహాలు అందించారు.

అనంతరం 800 మందికి అన్నిరకాల 21 పత్రిని ఉచితంగా పంచిపెట్టారు. ఈ పూజా కార్యక్రమాన్ని సుమారు 500 ప్రత్యక్షంగా, 5000 మంది అంతర్జాలం ద్వారా వీక్షించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 

మరిన్ని వార్తలు