సామాజికాభివృద్ధితోనే బంగారు తెలంగాణ

9 Apr, 2017 03:54 IST|Sakshi
సామాజికాభివృద్ధితోనే బంగారు తెలంగాణ

ఆర్థిక రంగ నిపుణుడు హనుమంతరావు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పడిన మూడేళ్లలోనే జాతీయ సగటుకన్నా మెరుగైన ఆర్థిక వృద్ధిరేటును సాధించిందని ఆర్థిక రంగ నిపుణుడు సీహెచ్‌ హనుమంతరావు అన్నారు. ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ సాకారాం కావాలంటే ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి, మానవాభివృద్ధి ఎంతో ముఖ్యమన్నారు. శనివారం సెస్‌ ఆడిటోరి యంలో జరిగిన తెలంగాణ ఎకనామిక్‌ అసోసి యేషన్‌ (టీఈఏ) వార్షిక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందు నెలకొన్న రాజకీయ అనిశ్చితి, విద్యుత్‌ సమస్యల కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు తగ్గిందని, కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక అనిశ్చితి తొలగి సుస్థిర పాలన కొనసాగుతోందని, విద్యుత్‌ కష్టాలు లేకపోవడం తో పరిశ్రమలు, పెట్టుబడులు రావడం తదితర కారణాలతో ఆర్థిక వృద్ధి రేటు మెరుగైందని తెలిపా రు. అయితే రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలికవసతులతో పెరిగిన వృద్ధిరేటు సామాజిక, మానవాభివృద్ధి వైపు మళ్లడం లేదని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరణ చేస్తే నాణ్య మైన సేవలను ప్రజలు అందుకోవడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. అంగన్‌వా డీలను ప్లే స్కూల్‌గా మార్చడం, ఆరో తరగతి నుంచి రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ప్రాథమిక విద్యపైనా దృష్టి సారించాలన్నారు.

అధిక పన్నుతోనే వెనుకబాటు...
మొఘల్‌ చక్రవర్తుల కాలం నుంచి వ్యవసాయంపై పన్ను వసూలులో నెలకొన్న వ్యత్యాసం వల్లనే ఏపీ, తెలంగాణ ప్రాంతాల మధ్య వైరుధ్యం కనిపించిందని సెంటర్‌ ఫర్‌ తెలంగాణ స్టడీస్‌ హెడ్‌ పి.గౌతమ్‌ అన్నారు. బ్రిటీష్‌ పాలనలో ఆంధ్రలో 10 శాతం పన్ను ఉంటే, తెలంగాణలో 50శాతం పన్ను వసూలు చేసేవారన్నారు. ఏపీ ఏర్పడిన తర్వాత కూడా పాలకులు పాత పన్ను విధానాన్నే కొనసాగించారని, ఫలితంగా తెలంగాణ నుంచి వచ్చిన రాబడిలోనూ కొంత మొత్తా న్ని ఆంధ్ర అభివృద్ధికి కేటాయించారన్నారు. ఈ విధానాన్ని రద్దు చేసిన కారణంగానే ఎన్టీఆర్‌కు తెలంగాణ ప్రజలు విశేషంగా మద్దతు తెలిపారన్నా రు. గత వందేళ్లలో తెలంగాణలో పన్ను విధానంపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.పి.ఆచార్య, టీఈఏ అధ్యక్షుడు తిప్పారెడ్డి, కార్యదర్శి ముత్యం రెడ్డి, ఉపాధ్యక్షురాలు రేవతి, సెస్‌ చైర్మన్‌ రాధాకృష్ణ, డైరెక్టర్‌ గాలబ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు