వృద్ధి బలపడుతుంది...

10 Nov, 2023 04:33 IST|Sakshi

ద్రవ్యోల్బణం దిగివస్తుంది

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ భరోసా

ముంబై: భారతదేశంలో ఆర్థిక వృద్ధి బలంగా పుంజుకుంటోందని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. దేశీయంగా ఉన్న అంతర్గత పరిస్థితులు, వివేకవంతమైన పాలసీ విధానాలతో ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోకి వస్తోందని భరోసాను ఇచ్చారు. టోక్యోలో ట్యోక్యో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భారత్‌ ఎకానమీపై ఆయన మాట్లాడుతూ ఆర్‌బీఐ అన్ని సవాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉందని, ద్రవ్య విధానం ద్రవ్యోల్బణం కట్టడికి, వృద్ధికి తోడ్పడుతుందని కూడా చెప్పారు.

2 శాతం ప్లస్‌ లేదా మైనస్‌లతో 4 శాతం వద్ద రిటైల్‌ ద్రవ్యోల్బణం కొనసాగేలా చర్యలు ఉండాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. సుపరిపాలన, సమర్థవంతమైన పర్యవేక్షణ, నైతిక ప్రవర్తన,  రిస్క్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించడం భారత్‌ దృష్టి సారించడం జరిగిందన్నారు.  సెల్ఫ్‌ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్‌ (ఎస్‌ఆర్‌ఓ) ద్వారా ఫిన్‌టెక్‌లు తమకుతాము స్వీయ–నియంత్రణను పాటించేలా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతోందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ భారత్‌ ఎకానమీ పటిష్టంగా కొనసాగుతోందన్నారు.

మరిన్ని వార్తలు