‘ఎత్తిపోతల’ను వెంటనే పూర్తిచేయండి

5 Mar, 2017 02:24 IST|Sakshi
‘ఎత్తిపోతల’ను వెంటనే పూర్తిచేయండి

పనులు పూర్తి చేయని ఏజెన్సీలను బ్లాక్‌ లిస్టులో పెట్టండి
ఐడీసీకి హరీశ్‌రావు ఆదేశం  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) చేపట్టిన ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ ఖరీఫ్‌లో సాగు నీరందించాలని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మొత్తం ఐడీసీ లిప్టు పథకాల ద్వారా ఖరీఫ్‌లో ఎంత ఆయకట్టుకు సాగు నీరందిస్తున్నారో లక్ష్యాలను నిర్దేశించు కోవాలని ఐడీసీని ఆయన ఆదేశించారు. శనివారం ఐడీసీ కార్యాలయంలో ఆ సంస్థ చేపట్టిన ఎత్తి పోతల పథకాల పురోగతిపై నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌ రావు సమీక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012 కంటే ముందు ప్రారంభించిన పథకాలు ఇప్పటికీ పూర్తి కానందుకు టీఎస్‌ఐడీసీ అధి కారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రా క్టు గడువులోగా పనులు పూర్తిచేయని ఏజెన్సీ లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. పూర్తి కావలసిన దశలో ఉన్న ఎత్తిపోతల పథకాలను  గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో తక్షణమే పూర్తి చేయాలన్నారు.

40 పథకాలు పూర్తి: శంకర్‌రెడ్డి
టీఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి మాట్లాడు తూ కోటి ఎకరాలకు నీరందించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నా యని అన్నా రు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 110 లిఫ్ట్‌ స్కీంలకు సీఎం కేసీఆర్‌ నిధులు కేటాయించార ని తెలిపారు. ఇందులో ఇప్పటికే 40 స్కీంలు పూర్తయ్యాయని, రూ. 7 కోట్లు ఖర్చు చేసి 15వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామన్నారు. ఇవి కాకుండా ప్రపంచ బ్యాంకు నిధులతో 17 స్కీంలకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఇప్పటికే 50 శాతం పనులు పూర్తి కావొస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా లిఫ్ట్‌లకు అవసరమైన విద్యుత్‌ లైన్ల పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని, అందుకు 16 గంటల విద్యుత్‌ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ఇరిగేషన్‌ కార్యదర్శి వికాస్‌ రాజు, టీఎస్‌ఐడీసీ ఎండీ. శ్రీదేవి, ఇతర ఆధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.  

అలసత్వం సహించం
పెండింగ్‌ పనులను ఈ ఏడాది పూర్తి చేసి ఖరీఫ్‌లో ఎస్సారెస్పీ 2 కింద 3.97 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరివ్వాలని అధికారులకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. అలసత్వం, అలక్ష్యం సహించేది లేదని.. సమర్థంగా పనిచేయని అధికారులను డిమోట్‌ చేస్తామని హెచ్చరించారు. శనివారం జలసౌధలో ఎస్సారెస్పీ స్టేజ్‌ 2 పనుల పురోగతిని మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి హరీశ్‌రావు సమీక్షించారు. ప్యాకేజీల పనులన్నీ ఖరీఫ్‌లోగా పూర్తి చేయాల్సిం దేనన్నారు. మిడ్‌మానేరు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని.. మిడ్‌ మానేరు నుంచి 25, ఎల్‌ఎండీ నుంచి 25 టీఎంసీల నీటిని విడుదల చేయను న్నందున ఎస్సారెస్పీ స్టేజ్‌ 2 కాలువలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలన్నారు. ఇంజనీరింగ్‌ అధికారులు ఆఫీసులు విడిచిపెట్టి క్షేత్రస్థాయి పర్యటనలు జరపాని,  కాల్వల వెంట స్వయంగా తిరిగితేనే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని హరీశ్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి.ప్రకాశ్, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్, ప్రభు త్వ స్పెషల్‌ సీఎస్‌ జోషి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు