ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉంటేనే అడ్మిషన్లు: హైకోర్టు

23 Sep, 2015 13:48 IST|Sakshi
ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉంటేనే అడ్మిషన్లు: హైకోర్టు

తెలంగాణలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల విషయమై హైకోర్టులో విచారణ ముగిసింది. ఫ్యాకల్టీతో పాటు ఇతర సదుపాయాలను ఆరు వారాల్లోగా సమకూర్చుకోవాలని కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టు సూచించింది. అలా సమకూర్చుకున్న తర్వాత మాత్రమే అడ్మిషన్లకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది.

హైకోర్టు ప్రతినిధితో పాటు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించి, సదుపాయాలు పరిశీలించాలని స్పష్టం చేసింది. ఆ పరిశీలనలో ప్రమాణాలు లేవని తేలితే అడ్మిషన్లు రద్దు చేయాలని కూడా హైకోర్టు తన ఆదేశాలలో తెలిపింది.

>
మరిన్ని వార్తలు