బీసీల డిమాండ్లను ప్లీనరీ ఎజెండాలో చేర్చండి: జాజుల

15 Apr, 2018 01:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 27న జరగనున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ ఎజెండాలో బీసీల డిమాండ్లను చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజు ల శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. శనివారం టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ తీర్మానాల కమిటీ చైర్మన్‌ కే కేశవరావును కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బీసీల సమస్యలపై విసృతంగా చర్చించి తీర్మానాలు చేయాలి.

చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించే విధంగా, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని అమలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరుపున బీసీలకు 60 అసెంబ్లీ, 9 ఎంపీ స్థానాలు కేటాయించాలి. రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేసి, కుల ఫెడరేషన్లకు వంద కోట్లు ఇవ్వాలి’ అని అన్నారు. సీఎం కేసీఆర్‌తో చర్చించి, పార్టీ తీర్మానాల్లో బీసీ డిమాండ్లు ఉండే లా చూస్తానని కేకే చెప్పారని జాజుల తెలిపారు.  

మరిన్ని వార్తలు