'ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు'

15 Oct, 2016 18:12 IST|Sakshi
'ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు'

హైదరాబాద్: టీఆర్‌ఎస్ రెండేళ్ల పాలనలో విద్యా, వైద్యరంగాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి విమర్శించారు. ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ ఆరోగ్యశ్రీని అటకెక్కించిందని.. బకాయిలు చెల్లించకపోవడం వల్లే పేదలకు వైద్యం అందని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబం ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం మొత్తం ఆరోగ్యంగా ఉన్నట్లు కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు.

ఇప్పడికిప్పుడు ఎన్నికలు వస్తే.. ప్రతిపక్షాలు 7, 8 సీట్లకే పరిమితం అవుతాయన్న కేసీఆర్ మాటలు ఉత్తి భ్రమ అని.. ఇచ్చిన హామీలు గాలికొదిలేసిన కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో 20 నుంచి 25 సీట్లే దక్కుతాయని.. అధికారం కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయం అని అన్నారు.

మరిన్ని వార్తలు