స్నేక్ లవర్.. వైరల్ వీడియో! | Sakshi
Sakshi News home page

స్నేక్ లవర్.. వైరల్ వీడియో!

Published Sat, Oct 15 2016 6:22 PM

స్నేక్ లవర్.. వైరల్ వీడియో! - Sakshi

సాధారణంగా మనం పాము అని పదం వినిపించగానే వామ్మో అంటూ పరుగులు పెడుతుంటాం. అయితే అందరూ ఒకలా ఉండరు కదా. విషం ఉన్న పాములనైనా సరే మచ్చిక చేసుకోవడం అతడి ప్రత్యేకథం. ఎన్నో ఏళ్లుగా పాములను పట్టి, కొన్నిరోజులు వాటి సంరక్షణ బాధ్యతలు చూసిన తర్వాత అడవిలోకి తీసుకెళ్లి వాటిని వదిలేయడం అతడికి సరదా. అతడే మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ వాసి సలీం ఖాన్.

ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా పాము కనిపించిందా.. వెంటనే సలీంకు ఫోన్ కాల్ వెళ్తుంది. కొన్ని నిమిషాల్లో వారి ఇళ్లల్లో ప్రత్యక్షమై పామును పట్టి తీసుకెళ్తాడు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు కేబినెట్ మంత్రులు, ఇతర నేతల ఇళ్లల్లో కూడా పాములు పట్టిన అనంతరం గత నెల సెప్టెంబర్ 23న రెగ్యులర్ డ్యూటీని నిర్వహిస్తుండగా ఓ ఫొటోగ్రాఫర్ ఈ దృశ్యాలను తన కెమెరాలో బంధించి సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. భోపాల్ సమీపంలోని హోషాంగబాద్ పంచమధి అడవిలో ఈ స్నేక్ లవర్ దాదాపు 350 పాములను వదిలేశాడు. అందులో విషపూరిత కోబ్రాలు కూడా ఉన్నాయి.

గోనేసంచిలో ఫారెస్ట్ వద్దకు వచ్చి ఇలా పాములను ఎన్నో పర్యాయలు వదిలేశాను అంటున్నాడు స్నేక్ లవర్ సలీం ఖాన్. పాములు మన శత్రువులు కాదని మిత్రులని, ముఖ్యంగా రైతులకు పంటపొలాల్లో ఎలుకల బెడద నుంచి ఉపయోగపడతాయని చెప్పాడు. ఇటీవల ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో ఆ వీడియో చూసిన వారు సలీం ఈజ్ స్నేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటూ పిలుస్తున్నారు.

సాయంత్రం వేళల్లో చాలా చల్లగా ఉంటుందని, ఆ సమయంలో పాములను వదిలేస్తామన్నాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత పాములను అడవిలో వదిలేసి, అనంతరం వాటికి ఎలాంటి అపాయం జరగకూడదని దేవుడ్ని పూజించి వెళ్లడం ఆయనకు అలవాటుగా మారింది. తన 30ఏళ్ల కెరీర్లో 2,20,000 పాములను ఆ అడవిలో వదిలానని గర్వంగా చెబుతున్నాడు. పగటివేళ అయితే ఎండ వేడిమికి పాములకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నాడు ఈ స్నేక్ లవర్.









 



Advertisement
Advertisement