ఖేడ్ ఓటర్లు కొత్త చరిత్ర లిఖించారు

14 Feb, 2016 01:07 IST|Sakshi
ఖేడ్ ఓటర్లు కొత్త చరిత్ర లిఖించారు

ప్రజాస్వామ్య స్ఫూర్తి వెల్లివిరిసింది: హరీశ్

 సాక్షి, హైదరాబాద్: గతంలో ఘర్షణలు, ఆందోళనల మధ్య నారాయణఖేడ్‌లో ఎన్నికలు జరిగిన చరిత్రే ఇంతకాలం చూశామని, ఇప్పుడు దానికి విరుద్ధంగా ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ విషయంలో అధికారుల తీరు అభినందనీయమన్నారు. ఓటర్లు కూడా గతంలో కంటే చైతన్యాన్ని ప్రదర్శించి నారాయణ ఖేడ్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేనంత పోలింగ్ నమోదుకు కారణమయ్యారన్నారు. కొత్త చరిత్ర లిఖించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారన్నారు. శనివారం అక్కడ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన ఈమేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రచారంలో రాజకీయ పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణాన్ని వేడెక్కించాయని, ఇప్పుడు ఎన్నిక ముగిసినందున ఆ నియోజకవర్గ అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేసేందుకు పార్టీలు ముందుకురావాలని ఆయన కోరారు.  

 టీఆర్‌ఎస్‌కు భారీ ఆధిక్యం: ‘ఆరా’ సర్వే
 నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు భారీ ఆధిక్యం లభిస్తుందని ‘ఆరా’ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. తమ ఎగ్జిట్ పోల్ గణాంకాలను బట్టి టీడీపీ డిపాజిట్ కోల్పోతుందని, కాంగ్రెస్ 19-20 శాతం ఓట్లు సాధించవచ్చని తెలిపింది.

>
మరిన్ని వార్తలు