కేటీఆర్ ది అవివేకం, అహంకారం

6 Apr, 2016 03:26 IST|Sakshi

ధ్వజమెత్తిన మధుయాష్కీ, శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: అవివేకం, అహంకారం, అజ్ఞానంతో రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ, టీపీసీసీ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. గాంధీభవన్‌లో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ కూడా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుందంటే టీఆర్‌ఎస్‌కు, కేటీఆర్‌కు ఉలుకు, వణుకు ఎందుకని వారు ప్రశ్నించారు. అవినీతి బయట పడుతుందని కేటీఆర్ భయపడుతున్నారన్నారు. కేటీఆర్‌కు ఐటీ తప్ప చట్టం తెలిసినట్టులేదని మధు యాష్కీ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీఆర్‌ఎస్ హామీ ఇచ్చిందని, ఆ హామీని అమలు చేయకుండా కాంగ్రెస్‌పై నిందలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తు విషయంలో ఎంపీ కవిత డ్రామాలు ఆడుతున్నారని వారన్నారు.

మరిన్ని వార్తలు