ఉచిత బస్సులేమయ్యాయి..?

17 Aug, 2016 02:30 IST|Sakshi

అధికారులపై మంత్రి మహేందర్‌రెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: పుష్కర ఘాట్లకు దూరంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినందున అక్కడ వాహనాలు నిలిపి, నది వద్దకు వెళ్లేందుకు భక్తులకు ఉచితంగా బస్సులను ఏర్పాటు చేయటంలో ఆర్టీసీ విఫలమైన నేపథ్యంలో అధికారులపై రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్సులు లేవని భక్తుల నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్‌లోని రంగాపూర్ పుష్కర ఘాట్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. పుష్కర స్నానం అనంతరం ఆర్టీసీ అధికారులతో సమీక్షించారు. పార్కింగ్ స్థలాల నుంచి నది వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసి భక్తులను తరలించాల్సిందేనని ఆదేశించారు. పుష్కరాల్లో 20 ల క్షల మంది భక్తులను ఆర్టీసీ బస్సుల ద్వారా తరలించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 4 లక్షల మందిని తరలించినట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు